సెలెక్టర్లకు బీసీసీఐ  రూ.20 లక్షల నజరానా | BCCI announce Rs 20 lakh cash reward for selectors for Australia triumph | Sakshi
Sakshi News home page

సెలెక్టర్లకు బీసీసీఐ  రూ.20 లక్షల నజరానా

Published Wed, Jan 23 2019 12:59 AM | Last Updated on Wed, Jan 23 2019 12:59 AM

BCCI announce Rs 20 lakh cash reward for selectors for Australia triumph - Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్‌ విజయంతో జాతీయ జట్టు సెలెక్టర్లకు బీసీసీఐ రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సహా కమిటీలోని సెలెక్టర్లు దేవాంగ్‌ గాంధీ, జతిన్‌ పరంజపే, గగన్‌ ఖోడా, శరణ్‌దీప్‌ సింగ్‌లకు ఈ మొత్తం దక్కనుంది.

ఆసీస్‌ పర్యటనకు పటిష్టమైన జట్టును ఎంపిక చేశారని ఈ సందర్భంగా వారిని క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) సభ్యులు వినోద్‌ రాయ్, డయానా ఎడుల్జీ ప్రశంసించారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement