![First chance for Rahul - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/1/msk.jpg.webp?itok=VhlAYjBA)
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాన్ కిషన్‌కంటే మిడిలార్డర్‌లో రాహుల్ ఎంతో విలువైన ఆటగాడని ఆయన అన్నారు.
తన ప్రదర్శనతో దీనిని అతను రుజువు చేసుకున్నాడని, మరో చర్చకు ఆస్కారం లేద ని ప్రసాద్ చెప్పారు. రాహుల్‌కు గాయం కావడం లేదా సుదీర్ఘ టోర్నీ కాబట్టి కొన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా విశ్రాంతినివ్వాల్సి వస్తేనే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎమ్మెస్కే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment