
ముంబై: వచ్చే ప్రపంచకప్‌లో వికెట్ల వెనుక జట్టు భారాన్ని మోసేదెవరో దాదాపు తేలిపోయింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనినే 2019 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తామని జాతీయ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ‘భారత్ ‘ఎ’ జట్టు పర్యటనల్లో మేం కొందరిని తయారు చేస్తున్నాం. అయినప్పటికీ ప్రపంచకప్‌కు ధోనినే కీపర్‌గా నిశ్చయించాం. ఆ మెగా ఈవెంట్ తర్వాత మిగతా వారిని పరీక్షిస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో ధోనినే నంబర్‌వన్ కీపర్.
శ్రీలంక సిరీస్‌లో అతడు చేసిన స్టంపింగ్‌లు, పట్టిన క్యాచ్‌లు అద్భుతం. ఇప్పటికీ భారత క్రికెట్‌లో అతడికి సమీపంగా వచ్చేవారెవరూ లేరు’ అని ప్రసాద్ పేర్కొన్నారు. యువ కీపర్లు రిషభ్ పంత్, సంజు శామ్సన్ తమ అంచనాలను అందుకోలేకపోతున్నారని... మరింత మెరుగయ్యేందుకు భారత ‘ఎ’ జట్టులో వారికి అవకాశాలిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment