
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లకి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్‌దీప్ సింగ్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్లు జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్ జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్థానం సందిగ్థంలో పడింది.
అదే విధంగా హార్షల్ పటేల్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్ల నుంచి షమీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు షమీకి చోటు దక్కకపోయినా.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అతడు జట్టులో ఖచ్చితంగా ఉండాలని నెహ్రా తెలిపాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు షమీకి సెలెక్టెర్లు విశ్రాంతి ఇచ్చారు.
"టీ20 ప్రపంచకప్ కోసం భారత ప్రణాళికలో షమీ లేనట్లు కనిపిస్తోంది. ఒక వేళ అతడిని ఎంపిక చేసినా.. అద్భుతంగా రాణిస్తాడు. అతడు టెస్టు, వన్డే క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. క ఈ మెగా టోర్నమెంట్‌లో యువ ఆటగాళ్లకి అవకాశం ఇచ్చినా..వచ్చే ఏడాది జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్‌కు అతడిని తప్పకుండా ఎంపిక చేయాలి.
ఐపీఎల్ తర్వాత షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ ఏడాదిలో పెద్దగా వన్డే సిరీస్‌లు లేవు. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత జరగునున్న వన్డే సిరీస్‌కు షమీకి చోటు దక్కవచ్చు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును ఓడించాలంటే ఖఛ్చితంగా షమీ లాంటి బౌలర్ జట్టులో ఉండాలి" అని నెహ్రా పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి'