టీమిండియా స్వింగ్ సుల్తాన్ మొహమ్మద్ షమీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన షమీ.. మెగా టోర్నీ ఆధ్యాంతం గాయంతో సతమతమయ్యాడని సమాచారం. దీర్ఘకాలిక మడమ సమస్యతో బాధపడుతున్న షమీ నొప్పిని అధిగమించేందుకు ప్రతి మ్యాచ్‌కు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వాడాడని అతని సహచరుడొకరు ప్రముఖ న్యూస్ ఛానెల్‌తో చెప్పాడు.
గాయం కారణంగా అప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన షమీ.. హార్దిక్ గాయపడ్డాక బెంచ్‌పై కూర్చోకూడదని నిర్ణయించకున్నాడట. అందుకే రిస్క్ చేసి మరీ బరిలోకి దిగాడట. ఆట పట్ల షమీకి ఉన్న అంకితభావం గురించి తెలిసి అభిమానులు అతన్ని పోరాట యోధుడితో పోలుస్తున్నారు. షమీ.. నీ కమిట్‌మెంట్‌కు సలాం అని కొనియాడుతున్నారు.
కాగా, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్ వరకు అద్భతమైన ఆటతీరు కనబర్చి, తుది సమరంలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో షమీ 7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతల సాయంతో 24 వికెట్లు పడగొట్టాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వరల్డ్‌కప్ అనంతరం విరామం తీసుకున్న షమీ.. తొలుత సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు.
అయితే బీసీసీఐ నుంచి అతనికి ఫిట్‌నెస్ క్లియెరెన్స్ దక్కకపోవడంతో సిరీస్ మొత్తనికి దూరంగా ఉన్నాడు. షమీ గైర్హాజరీలో టీమిండియా.. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. షమీ స్థానంలో రెండో టెస్ట్‌కు ఆవేశ్ ఖాన్‌ను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. వచ్చే ఏడాది (2024) జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది.
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment