
కాలం చాలా చిత్రమైన పరీక్షలు పెడుతుంది. ఒక్కోసారి ఊహించని మలుపులు తిప్పుతుంది. ఇందుకు సజీవ సాక్ష్యం టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 సిరీస్‌కు నెహ్రా (38)ను ఎంపిక చేయడం ఒకరకంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్వంటీ20 జట్టుకు ఎంపికైన వారిలో నెహ్రానే వయసులో అందరికంటే పెద్దవాడు. నెహ్రాతో పాటు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు.. ఆటకు గుడ్‌బై కొట్టేసి వివిధ వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా నవంబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచే నెహ్రా ఆఖరిదని బీసీసీఐ ప్రకటించింది. ఎప్పుడో మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నెహ్రా తరువాత కాలంలో సచిన్, గంగూలీ, ద్రావిడ్, ధోనీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ నాయకత్వంలో క్రికెట్ ఆడారు.
నెహ్రా గురించిన ఆసక్తికర విషయాలు మీ కోసం
- ఆశిష్ నెహ్రా 1999లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించారు. అదే ఏడాది ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా అదే ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ కెరీర్ మొదలు పెట్టారు. ప్రస్తుత భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ కూడా 2001లొ అతంర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టారు.
- నెహ్రా అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టినపుడు శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ. అదే జట్టులో ఉన్న అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, హసన్ తిలకరత్నే, మార్వన్ ఆటపట్టు, మహేల జయవర్ధనే, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్, ఏంజెలో మ్యాథ్యూస్‌లు శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి రిటైర్ అయ్యారు.
- ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టేనాటికి.. బంగ్లాదేశ్‌కు టెస్ట్ హోదా లేదు.
- నెహ్రాతో పాటు అదే ఏడాది ఇంటర్నేషనల్ కెరీర్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డారెన్ లీమన్.. ప్రస్తుతం ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
- నెహ్ర అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నాటికి ప్రస్తుత జట్టు సభ్యుడు కుల్దీప్ యాదవ్ వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment