
న్యూఢిల్లీ: వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా చాలా మంచివాడని టీమిండియా ఆల్‌రౌండర్ సురేశ్ రైనా అన్నాడు. నెహ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవడంతో అతడితో తనకున్న అనుబంధాన్ని రైనా గుర్తు చేసుకున్నాడు. ‘అతడు చాలా మంచి మనిషి. తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తాడు. చాలాసార్లు అతడిని కలిశాను. అతడితో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. ఎల్లప్పుడు మంచి సలహాలు ఇచ్చే వారిలో అతడొకరు. 38 ఏళ్ల వయసులోనూ ఎంతో బలంగా ఉన్నాడు. అతడు ఆడే చివరి మ్యాచ్‌లో రాణించి, దేశానికి విజయాన్ని అందిస్తాడని ఆశిస్తుస్తున్నా’ అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. నవంబర్ 1న సొంత మైదానం ఢిల్లీలో న్యూజిలాండ్‌తో జరిగే టి20 మ్యాచ్‌తో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు.
గువాహటిలో ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్లు రువ్విన ఘటనపైనా సురేశ్ రైనా స్పందించాడు. ‘ఇది బాధాకర ఘటన. ఏం జరిగిందనేది బీసీసీఐ విచారిస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లతో కలిసి ఐపీఎల్‌లో ఆడాం. ఎవరికీ గాయాలు కాలేదు కాబట్టి ఫర్వాలేదు. బీసీసీఐ, అవినీతి వ్యతిరేక విభాగం, పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని రైనా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment