'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా' | Nehra, Bhuvneshwar taught me seam position, says Sran | Sakshi
Sakshi News home page

'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా'

Published Fri, Jun 17 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా'

'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా'

హరారే: తన పేస్ బౌలింగ్ మరింత మెరుపడ్డానికి టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్లే కారణమంటున్నాడు యువ బౌలర్ బరిందర్ శ్రవణ్.  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆ ఇద్దరి బౌలర్ల నుంచి కొన్ని మెళకువలు నేర్చుకోవడం వల్లే తన ప్రదర్శన మెరుగుపడిందని తాజాగా స్పష్టం చేశాడు. 'ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో  మేము ముగ్గురం అనేక విషయాలు షేర్ చేసుకున్నాం.  వారు సీనియర్లు కావడంతో నాకు చాలా సలహాలిచ్చారు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారు నాకు కొన్ని అమూల్యమైన సలహాలిచ్చారు. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది' అని శ్రవణ్ అన్నాడు. ఏ విధమైన సందేహాన్ని అడిగినా వారిద్దరూ ఎంతో సహనంతో తనకు సహకరించేవారని కొనియాడాడు.

 

ప్రస్తుతం తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను  కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం కోసమే స్వల్ప మార్పులు చేసుకున్నట్లు తెలిపాడు. తన జింబాబ్వే పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రవణ్.. ఇంకా తాను ఫిట్ నెస్ పరంగా, బౌలింగ్ పరంగా ఇంకా చాలా  మెరుగపడాల్సి ఉందని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement