barinder sran
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా బౌలర్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ బరిందర్ స్రాన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే దేశవాలీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 31 ఏళ్ల స్రాన్ 2016లో టీమిండియా తరఫున 6 వన్డేలు, 2 టీ20లు ఆడి 13 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో స్రాన్ కేవలం 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్రాన్ తన వన్డే, టీ20 కెరీర్లను ఎంఎస్ ధోని నేతృత్వంలోనే ప్రారంభించాడు. అప్పట్లో స్రాన్‌కు ధోని మద్దతు బాగా ఉండేది. స్రాన్ ఓ మోస్తరుగా రాణించినా టీమిండియాలో చోటు కాపాడుకోలేకపోయాడు. స్రాన్ వన్డే అరంగేట్రం చేసే సమయానికి కేవలం ఎనిమిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. స్వల్ప వ్యవధిలోనే అతను అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్రాన్ వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లోనూ ఆడాడు. అతను రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ తరఫున 24 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. స్రాన్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను 2019లో.. లిస్ట్-ఏ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అప్పటినుంచి అతనికి అవకాశాలు రాక క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. -
Ind Vs SL: అరంగేట్రంలోనే దుమ్మురేపిన మావి.. అరుదైన జాబితాలో చోటు
India vs Sri Lanka, 1st T20I- Shivam Mavi: అరంగేట్రంలోనే దుమ్ములేపాడు టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ శివం మావి. శ్రీలంకతో స్వదేశంలో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్.. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక(1), వన్‌డౌన్ బ్యాటర్ ధనంజయ డి సిల్వా(8) సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ(21), మహీశ్ తీక్షణ(1)లను పెవిలియన్‌కు పంపాడు. నమ్మకం నిలబెట్టుకుని బంతిని తన చేతికి ఇచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఐదో బంతికి నిసాంకను బౌల్డ్ చేసిన మావి.. మిగతా మూడు వికెట్లు కూల్చే క్రమంలోనూ తడబడలేదు. మొత్తంగా తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మావి.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో శివం మావిపై ప్రశంసలు కురుస్తున్నాయి. హుడా, మావి, చహల్ అరుదైన జాబితాలో అరంగేట్రంలోనే ఈ మేరకు అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ 24 ఏళ్ల యూపీ క్రికెటర్.. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘనత కూడా సాధించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా, బరీందర్ సరన్ ఈ ఫీట్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. అరంగేట్రంలోనే 4 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు 1. ప్రజ్ఞాన్ ఓజా- 2009లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో- 21/4 2. బరీందర్ సరన్- 2016లో జింబాబ్వేతో మ్యాచ్‌లో- 10/4 3. శివం మావి- 2022లో శ్రీలంకతో మ్యాచ్‌లో- 22/4. ఇక ఈ ముగ్గురిలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బరీందర్ నిలిచాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు 10 పరుగుల మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. చదవండి: Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా! From claiming a four-wicket haul on debut to the feeling of representing #TeamIndia 👏🏻👏🏻 Bowling Coach Paras Mhambrey Interviews Dream Debutant @ShivamMavi23 post India’s win in the first #INDvSL T20I👌🏻 - By @ameyatilak Full interview 🎥🔽 https://t.co/NzfEsb5ydo pic.twitter.com/z9CuqFqlLP — BCCI (@BCCI) January 4, 2023 -
అదే నాకు పెద్ద అవకాశం:శరణ్
హరారే:జింబాబ్వే పర్యటన ద్వారా అటు వన్డేల్లో, ఇటు టీ 20ల్లో ఒకేసారి అరంగేట్రం చేయడమే తనకు లభించిన పెద్ద అవకాశమని టీమిండియా పేసర్ బరిందర్ శరణ్ స్పష్టం చేశాడు. దీంతో పాటు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నాడు. 'ధోని సారథ్యంలో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం నాకు లభించిన గొప్ప అవకాశం. మహీ భాయ్ నాకు రెండింట్లో అవకాశం కల్పించాడు. అరంగేట్రం అద్భుతంగా ఉండాలనేది ప్రతీ ఒక్క క్రికెటర్ కల. అది తన టీ 20 ప్రదర్శన ద్వారా నెరవేరినందుకు ఒకింత గర్వంగా ఉంది'అని శరణ్ తెలిపాడు. టీ 20ల్లో బ్యాట్స్‌మెన్‌ను తొందరగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో బౌలర్‌పై ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుందన్నాడు. బంతిని సరైన లెంగ్త్‌లో సంధించడంతో పాటు, పేస్‌లో కూడా వైవిధ్యం అవసరమన్నాడు. తన బౌలింగ్ మెరుగు పడ్డానికి వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్లే కారణమన్నాడు. తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం ఎలానో ఆ ఇద్దర బౌలర్ల నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో తాము అనేక విషయాలు షేర్ చేసుకున్నామని, అదే క్రమంలో వారు సీనియర్లు కావడంతో చాలా సలహాలిచ్చారని బరిందర్ తెలిపాడు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారిచ్చిన కొన్ని టిప్స్ తనకు బాగా ఉపకరిస్తున్నాయని బరిందర్ మరోసారి పునరుద్ఘాటించాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో బరిందర్ శరణ్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు సాధించడం ద్వారా శరణ్ అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. తద్వారా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రంలో నమోదు చేసిన రికార్డును సవరించాడు. ఓవరాల్ టీ 20 అరంగేట్రం రికార్డులో మెరుగైన గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ గా శరణ్ నిలిచాడు. -
శరణ్ సరికొత్త చరిత్ర!
హరారే:భారత పేస్ బౌలర్ బరిందర్ శరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ 20 అరంగేట్రంలో అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. జింబాబ్వేతో రెండో టీ 20లో నాలుగు ఓవర్లలో పది పరుగులకే నాలుగు వికెట్లు సాధించడం ద్వారా శరణ్ అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. తద్వారా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరంగేట్రంలో నమోదు చేసిన రికార్డును సవరించాడు. 2009లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఓజా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించాడు. కాగా ఆ మ్యాచ్‌లో ఓజా 21పరుగులివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఓవరాల్ టీ 20 అరంగేట్రం రికార్డులో మెరుగైన గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ గా శరణ్ నిలిచాడు. అంతకుముందు 2012లో ఐర్లాండ్ తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ ఎలియస్ సన్నీ ఐదు వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో పాటు ఒకే ఓవర్లలో మూడు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా శరణ్ మరో ఘనతను సాధించాడు. 2012లో అశోక్ దిండా శ్రీలంకతో జరిగిన టీ 20లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. -
'ఆ బౌలర్ల వల్లే మెరుగుపడ్డా'
హరారే: తన పేస్ బౌలింగ్ మరింత మెరుపడ్డానికి టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్లే కారణమంటున్నాడు యువ బౌలర్ బరిందర్ శ్రవణ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆ ఇద్దరి బౌలర్ల నుంచి కొన్ని మెళకువలు నేర్చుకోవడం వల్లే తన ప్రదర్శన మెరుగుపడిందని తాజాగా స్పష్టం చేశాడు. 'ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు జట్టుకు ఆడే క్రమంలో మేము ముగ్గురం అనేక విషయాలు షేర్ చేసుకున్నాం. వారు సీనియర్లు కావడంతో నాకు చాలా సలహాలిచ్చారు. ప్రత్యేకంగా సీమ్ పొజిషన్ పై వారు నాకు కొన్ని అమూల్యమైన సలహాలిచ్చారు. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది' అని శ్రవణ్ అన్నాడు. ఏ విధమైన సందేహాన్ని అడిగినా వారిద్దరూ ఎంతో సహనంతో తనకు సహకరించేవారని కొనియాడాడు. ప్రస్తుతం తన సీమ్ బౌలింగ్ పొజిషన్ ను కొద్దిగా మార్చుకోవడానికి వారిద్దరే ప్రధాన కారణమన్నాడు. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం కోసమే స్వల్ప మార్పులు చేసుకున్నట్లు తెలిపాడు. తన జింబాబ్వే పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రవణ్.. ఇంకా తాను ఫిట్ నెస్ పరంగా, బౌలింగ్ పరంగా ఇంకా చాలా మెరుగపడాల్సి ఉందని పేర్కొన్నాడు. -
శరణ్ కు జరిమానా
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బరిందర్ శరణ్ కు జరిమానా విధించారు. మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిపై మ్యాచ్ రిఫరీ చర్య తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరం (ఆర్టికల్ 2.1.7 ఐపీల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ప్లేయర్స్ అండ్ టీమ్ ఆఫీషియల్స్) కింద అతడిపై చర్య తీసుకున్నారు. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పార్థివ్ (10), బట్లర్ (11), అంబటి రాయుడు(54)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. -
'యువ పేసర్ బరిందర్ బౌలింగ్ భేష్'
పెర్త్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, టి-20 కెప్టెన్ జార్జి బెయిలీ.. భారత యువ పేసర్ బరిందర్ను ప్రశంసించాడు. బరిందర్ పేస్ బౌలింగ్ బాగుందని, అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని బెయిలీ అన్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తరపున బరిందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ వేదిక పెర్త్ వాకా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించినా బరిందర్ తన తొలి వన్డే మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. బరిందర్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇతర భారత బౌలర్లు భువనేశ్వర్, ఉమేష్, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు (309/3) చేసినా.. ఆస్ట్రేలియా విజయం సాధించింది. రోహిత్ శర్మ (171) అజేయ భారీ సెంచరీ వృథా కాగా, ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, బెయిలీ శతకాలతో తమ జట్టును గెలిపించారు. మ్యాచ్ అనంతరం బెయిలీ.. బరిందర్ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. పెర్త్ పిచ్‌పై 309 మంచి స్కోరు అయినా, తాము మరింత మెరుగ్గా ఆడాల్సిందని అన్నాడు. -
'ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతాం'
పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారం జరుగనున్న తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చూచాయగా వెల్లడించారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని చెప్పారు. భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డేలు, మూడు ట్వంటీ-20 మ్యాచులు ఆడనుంది. వరల్డ్ కప్ విజేతలైన ఆస్ట్రేలియా ప్రస్తుతం మొదటి ర్యాంకులో ఉండటం, భారత్ రెండో ర్యాంకులో ఉండటంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సిరీస్‌లో భారత్ ఒక్క వన్డే మ్యాచ్ గెలిచినా చాలు తన రెండోస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో వన్డేలకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా పేస్ బౌలింగ్ ప్రధాన పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లు ప్రధాన అస్త్రంగా భారత్ బరిలోకి దిగనుంది. వీరితోపాటు యువకేరటం బరిందర్ సింగ్ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా బరిలోకి దిగనున్నారు. -
బరిందర్‌కు భలే చాన్స్.. తొలి వన్డేలో చోటు!
పెర్త్: ఫాస్ట్ బౌలర్ బరిందర్ స్రాన్ భలే చాన్స్ కొట్టేశాడు. ఈ నెల 12న పెర్త్‌లో జరుగనున్న భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా మారింది. లెఫ్ట్ ఆర్మర్ అయిన ఈ 23 ఏళ్ల బౌలర్ టీమిండియాకు అదనపు బలం కానున్నాడని, స్రాన్ను మంగళవారం జరిగే తొలి వన్డేలో ఆడించే అవకాశముందని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. 'అతను మంచి శక్తిసామర్థ్యాలున్న బౌలర్. ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను లెఫ్ట్ ఆర్మర్ కావడం జట్టుకు అదనపు బలం. భవిష్యత్తులో ఓ మంచి బౌలర్‌ను తయారుచేయడానికి అవసరమైన వ్యక్తి దొరికాడని మేం భావిస్తున్నాం' అని అరుణ్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం, శనివారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ట్వంటీ-20, వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయాలు సాధించి.. ఇనుమడించిన ఉత్సాహంతో వన్డేలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో కీలక బౌలర్‌గా భావిస్తున్న మొహమ్మద్ షమీ గాయం కారణంగా వైదొలగడం.. కూడా బరిందర్ స్రాన్‌కు బాగా కలిసి వచ్చింది.