ఐపీఎల్-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
తమ జట్టు హెడ్‍కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్ హెడ్‌కోచ్‌గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్‌లో గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్‌లో జీటీ రన్నరప్ నిలిచింది.
అయితే ఐపీఎల్ 2024లో మాత్రం గుజరాత్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో గుజరాత్ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో గుజరాత్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్‌మన్ ఎంపికయ్యాడు.
ఇక గత మూడు సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
గుజరాత్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్‌పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment