
జట్టులోకి పునరాగమనం చేయడమే కష్టం: నెహ్రా
అరంగేట్రం చేయడంకన్నా జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం తిరిగి పునరాగమనం చేయడం చాలా కష్టమని
అరంగేట్రం చేయడంకన్నా జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం తిరిగి పునరాగమనం చేయడం చాలా కష్టమని భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన అతను దాదాపు ఐదేళ్ల అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడిన అనంతరం 37 ఏళ్ల నెహ్రా జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే గత నెలలో ఆసీస్ పర్యటనలో టి20 జట్టుకు ఎంపికై రాణించగలిగాడు.