అతనొక సూపర్ హీరో: సెహ్వాగ్ | ashish nehra comeback is nothing less than a Superhero, Virender Sehwag | Sakshi
Sakshi News home page

అతనొక సూపర్ హీరో: సెహ్వాగ్

Published Thu, May 26 2016 5:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

అతనొక సూపర్ హీరో: సెహ్వాగ్

అతనొక సూపర్ హీరో: సెహ్వాగ్

దాదాపు ఐదేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి ఇటీవల తిరిగి పునరాగమనం చేసిన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రాపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు.

ఢిల్లీ: దాదాపు ఐదేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి ఇటీవల పునరాగమనం చేసిన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రాపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అతని పునరాగమనం ఒక అద్భుతమైన ఘనతగా పేర్కొన్నాడు. ఆశిస్ పునరాగమనం సూపర్ హీరోకు ఎంతమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడ్డాడు.  ప్రస్తుతం నెహ్రా తన కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ గాయపడ్డ నెహ్రా లండన్‌లోని ప్రముఖ వైద్యులు విలియమ్సన్ దగ్గర చికిత్స చేయించుకున్నాడు.

 

ఈ మేరకు తన మిత్రుడు త్వరగా కోలుకోవాలంటూ 'గెట్ వెల్ సూన్ నెహ్రా జీ' ట్యాగ్ తో వీరేంద్ర సెహ్వాగ్ పలు ట్వీట్లు చేశాడు.  అయితే తన ఈ ట్వీట్లకు రీట్వీట్లు తక్కువగా రావడంతో సెహ్వాగ్ కొంటి సెటైర్లు వేశాడు. అంత పెద్ద ఆటగాడికి, ఇంత చిన్న సంఖ్యలో రీట్వీట్లా? అంటూ పేర్కొన్న సెహ్వాగ్..  'మీ ప్రేమను నెహ్రాకు కాస్త పంచండి'  అని మరో ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement