
సాక్షి, న్యూఢిల్లీ : తొలి టీ20 మ్యాచ్ లో శ్రేయర్ అయ్యర్ పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. తుది జట్టులోకి కొత్త ఆటగాడు శ్రేయర్ అయ్యర్ చేరడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. టీమిండియ కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా జట్టు క్యాప్ ను అందుకుంటూ కొత్త కుర్రాడు అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు దినేష్ కార్తీక్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో నెహ్రాకు చివరి మ్యాచే శ్రేయర్ అయ్యర్ కు అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం.
తన కెరీర్ లో చివరి ట్వంటీ20 మ్యాచ్ ఆడుతున్న భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రాకు జట్టు సభ్యులు అభినందనలు తెలిపారు. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న తొలి టీ20తో కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు నెహ్రా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి మ్యాచ్ టాస్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు నెహ్రాకు జ్ఞాపికను అందజేశారు. జట్టు సభ్యులు చప్పట్లు కొడుతుండగా.. మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నెహ్రాను జ్ఞాపిక ప్రదానం చేసి సత్కరించారు.
భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు నేటి మ్యాచ్‌తో శుభం కార్డు పడనుంది. 1999లో నెహ్రా భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సొంతగడ్డపై అతనికి విన్నింగ్ ఫేర్‌వెల్ ఇచ్చేందుకు ఢిల్లీ సహచరుడు భారత కెప్టెన్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment