
భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు నేటి మ్యాచ్‌తో శుభం కార్డు పడనుంది. 1999లో నెహ్రా భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సొంతగడ్డపై అతనికి విన్నింగ్ ఫేర్‌వెల్ ఇచ్చేందుకు ఢిల్లీ సహచరుడు భారత కెప్టెన్ కోహ్లి తన సేనతో సిద్ధమయ్యాడు.
సెహ్వాగ్ ద్వారం...
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌కు సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టారు. దీనిపై అతను స్పందిస్తూ ‘దీన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యువ క్రికెటర్లకు ప్రేరణ ఇచ్చేలా ఢిల్లీ సంఘం (డీడీసీఏ) తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. గేట్‌పై ఉన్న పేరును చూస్తే కుర్రాళ్లు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment