ఐపీఎల్ తరలింపుపై ఫ్రాంచైజీలు
ముంబై : భద్రతా కారణాల రీత్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌ను భారత్ నుంచి తరలిస్తే తమకు నష్టమేనని ఆయా ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. దేశంలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ జరుగబోతున్న దృష్ట్యా తగినంత భద్రత ఇవ్వలేమని హోం శాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రారంభ మ్యాచ్‌లను దక్షిణాఫ్రికాలో జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
‘లీగ్ భారత్‌లో కాకుండా ఎక్కడ నిర్వహించినా మాకు నష్టమే. ఇది ఎంత అనేది ఆయా జట్లను బట్టి రకరకాలుగా ఉంటుంది. దాదాపుగా 40 నుంచి 50 శాతం ఆదాయాన్ని మేం కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.
మరోవైపు టోర్నీని తమ దగ్గర నిర్వహించేందుకు కొన్ని రాష్ట్రాలు సుముఖంగానే ఉన్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ఎక్కువ ఆసక్తిగా ఉంది. ‘భద్రత అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. అదీకాకుండా మా ప్రజలు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో మమేకమయ్యారు. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ మ్యాచ్‌లు జరిగితే చూడాలని కోరుకుంటున్నారు. అదీగాకుండా వినోదం పన్ను కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది’ అని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో లీగ్‌ను నిర్వహించాలనే ఆలోచన కూడా బీసీసీఐకి ఉంది.
బయటికెళితే మాకు నష్టం
Published Wed, Feb 26 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement