మళ్లీ చిక్కుల్లో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్!
మళ్లీ చిక్కుల్లో బీసీసీఐ చీఫ్ శ్రీనివాసన్!
Published Tue, Sep 10 2013 5:41 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. వైఎస్ జగన్ ఆస్టుల కేసులో మంగళవారం దాఖలు చేసిన మూడు చార్జిషీట్లలో ఓ చార్జిషీట్ లో శ్రీనివాసన్ పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు చేర్చింది. ఇండియా సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో తాజా సీబీఐ చార్జిషీట్ లో మూడవ వ్యక్తిగా శ్రీనివాసన్ పేరును చేర్చింది.
ఇండియా సిమెంట్ కంపెనీ అధినేత శ్రీనివాసన్ భారీగా పెట్టుబడులను పెట్టినట్టు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. తాజా చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరును సీబీఐ మినహాయించింది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కష్టాల్లో పడిన శ్రీనివాసన్ కు తాజా వ్యవహారం ఇబ్బంది కలిగించే విషయమే.
Advertisement