
ముంబై ఇండియన్స్ కోచ్‌గా జయవర్ధనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చీఫ్ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే నియమితుడయ్యాడు. ప్రస్తుత కోచ్ రికీ పాంటింగ్ ఒప్పందం త్వరలో పూర్తికానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్‌స ఈ కొత్త నియామకాన్ని ప్రకటించింది. 39 ఏళ్ల జయవర్ధనే 2014 టి20 ప్రపంచ కప్ నెగ్గిన శ్రీలంక జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.