ఆరంభ మ్యాచ్‌లో ముంబైతో కోల్‌కతా ఢీ
ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ విడుదల
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది. చెన్నైలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యూఏఈ వేదికగా జరిగే తొలి విడత మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 16న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబిలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-7 మొదలవుతుంది. ఏప్రిల్ 30న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌తో తొలి అంచె పూర్తవుతుంది. ఇక మే 1 నుంచి 12 వరకు జరిగే రెండో విడత మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన భద్రత కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ఒకవేళ రెండో విడత మ్యాచ్‌ల నిర్వహణ భారత్‌లో సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ వేదికగా బంగ్లాదేశ్‌ను బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. చివరి విడత (మే 13 నుంచి జూన్ 1)లో జరిగే లీగ్ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్‌లు, ఫైనల్ భారత్‌లోనే నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 15న అబుదాబిలో ఐపీఎల్-7 ఆరంభ వేడుక.దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం.దుబాయ్, అబుదాబిల్లో ఏడేసి మ్యాచ్‌లు, షార్జాలో ఆరు మ్యాచ్‌ల నిర్వహణ.గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ అనుభవాల దృష్ట్యా షార్జాలో మ్యాచ్‌ల నిర్వహణపై తొలుత బీసీసీఐ వెనకడుగు వేసినా, యూఏఈ ప్రభుత్వ హామీతో పచ్చజెండా ఊపింది.
సాధారణ రోజుల్లో ఒక మ్యాచ్ , వారాంతపు(శుక్ర, శని, ఆదివారాల్లో) రోజుల్లో రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు.
వారాంతపు రోజుల్లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 2.30 (భారత కాలమానం ప్రకారం సా. గం. 4.00)కు, రెండో మ్యాచ్ సాయంత్రం గం. 6.30 (భారత కాలమానం ప్రకారం రాత్రి. గం. 8.00)కు ప్రారంభమవుతాయి.
సాధారణ రోజుల్లో మ్యాచ్ సా. గం. 6.30 (భారత కాలమానం ప్రకారం రాత్రి. గం. 8.00)కు మొదలవుతుంది. రెండు, మూడో విడతల్లో జరిగే 40 మ్యాచ్‌ల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న గవర్నింగ్ కౌన్సిల్.
యూఏఈలో 20 మ్యాచ్‌లు
Published Thu, Mar 20 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement