
క్రికెటర్ నుంచి బుకీ... అమిత్ సింగ్
కర్ణాటకలో జన్మించి గుజరాత్‌కు ఆడిన 30 ఏళ్ల అమిత్ సింగ్ 2009 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.
అంతకుముందు కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అమిత్ తాను ఆడిన తొలి ఐపీఎల్ ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీయడంతో అప్పటి కెప్టెన్ వార్న్ ప్రశంసలు పొందాడు. ఆ సీజన్‌లోనే రెండు సార్లు అనుమానాస్పద బౌలింగ్ శైలితో వార్తల్లోకెక్కాడు. 2012లో అమిత్‌ను రాజస్థాన్ వదులుకుంది. అనంతరం బుకీ అవతారమెత్తి నిషేధం ఎదుర్కొన్నాడు.