Amit singh
-
నొయిడాలోనూ కాదంబరి ‘హనీ ట్రాప్’
సాక్షి, అమరావతి : వలపు వల (హనీ ట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే ‘కిలేడీ’ కాదంబరి జత్వానీ మరో బ్లాక్మెయిల్ బాగోతం వెలుగు చూసింది. హనీట్రాప్, ఫోర్జరీ పత్రాలతో మోసం, బ్లాక్‌మెయిలింగ్ ద్వారా అక్రమ సంపాదనే జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వానీ ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్‌సింగ్‌ను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆగకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు గుంజడానికి వేధింపులకు గురి చేసింది. మాఫియాతో సంబంధాలున్నాయని చెప్పి మరీ అమిత్ సింగ్‌ను బెదించింది. బాధితుడు అమిత్ సింగ్ ఫిర్యాదుతో నొయిడా పోలీసులు కాదంబరి జత్వానీ ప్రథమ నిందితురాలిగా కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపైనా కేసు నమోదు చేశారు. సెక్షన్లు 386, 388, 467, 468, 471, 120–బి, 34 కింద ఈ ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారు.రేప్ చేశావని కేసు పెడతా... మాఫియాతో అంతం చేయిస్తానొయిడాకు చెందిన అమిత్‌సింగ్‌ను కాదంబరి జత్వానీ సోదరుడు అంబరీష్ దుబాయిలో కలిసి పరిచయం చేసుకున్నారు. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలున్నాయని, మోడలింగ్, సినీ రంగంలో ఉన్న తన సోదరి కాదంబరి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేస్తుందని చెప్పారు. అమిత్ సింగ్ భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కాదంబరి ఫోన్ చేసింది. విలువైన భూములు, ఇతర స్థిరాస్తులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి పరిచయం పెంచుకుంది.ఆ తర్వాత అమిత్ సింగ్‌ను కలవాలని చెప్పింది. ‘నేను చూపించే స్థిరాస్తులు నచ్చినా నచ్చకున్నా తన సాంగత్యం కచ్చితంగా నచ్చుతుంది’ అని ఆమె ఆయనతో అన్నది. తరువాత ఓ రెస్టారంట్లో అమిత్‌సింగ్‌ను కలిసి స్థిరాస్తుల విషయాలకంటే ఇతర వ్యవహారాలపైనే ఎక్కువగా మాట్లాడింది. అమిత్ సింగ్‌తో సెల్ఫీలు తీసుకుంది. తరువాత సాంకేతిక కారణాలతో తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని చెప్పి ఆయన నుంచి అప్పు పేరుతో కొంత డబ్బు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రూ.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అమిత్‌సింగ్ సమ్మతించకపోవడంతో బెదిరింపులకు దిగింది. తనను అత్యాచారం చేశావని, అసహజ రీతిలో లైంగిక వాంఛలు తీర్చమని వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో భయపడిన అమిత్‌సింగ్ కాదంబరికి పలు వాయిదాల్లో రూ.32 లక్షలు ఇచ్చారు. అయినా మరో రూ.38 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆమె తల్లి, తండ్రి కూడా డబ్బుల కోసం బెదిరించారు. కాదంబరి సోదరుడు అంబరీష్ కూడా నొయిడా వచ్చి మిగిలిన రూ.38 లక్షలు ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తానని హెచ్చరించారు.దీంతో బెంబేలెత్తిన అమిత్ సింగ్ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కాదంబరికి వివిధ సందర్భాల్లో చెల్లించిన రూ.32 లక్షలు, ఆమె ఆ మొత్తాన్ని డ్రా చేసుకున్నట్టు ఆధారాలను కూడా సమర్పించారు. దాంతో పోలీసులు కాదంబరి జత్వానీ, ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ, సోదరుడు అంబరీష్ జత్వానీతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. -
కాల్చుకుని చనిపోయిన ఏసీపీ.. దూకేసిన భార్య
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఏసీపీ స్థాయిలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య వాళ్లుండే అపార్టుమెంట్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత అపార్టుమెంట్లో ఉండేవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దంపతులను ఆస్పత్రికి తరలించగా, అమిత్ సింగ్ అప్పటికే మరణించారని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియడం లేదు. అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని కాల్చేసుకున్నారు. ఆ శబ్దం వినగానే సరిత పరుగున వెళ్లి గార్డును, ఇరుగు పొరుగులను పిలిచింది. మృతదేహాన్ని చూడగానే ఆమె వెళ్లి బాల్కనీ లోంచి దూకేసింది. మూడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య ఇటీవల తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. -
అమిత్ సింగ్ కు 5 రోజుల కస్టడీ
హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన అక్కచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ ను ఐదురోజులు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. చైతన్యపురిలోని యామిని, శ్రీలేఖలను అతి కిరాతకంగా హత్యచేసిన అమిత్ ను చైతన్యపురి పోలీసులు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపరిచారు. ఈ కేసును శుక్రవారం విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. -
అక్కచెల్లెళ్లను చంపిన అమిత్ దొరికిపోయాడు
-
పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది!
ఈనెల 14న అక్కాచెల్లెళ్లను హత్య చేసి పరారైన అమిత్‌సింగ్ పోలీసులకు దొరక కుండా 14 రోజులపాటు ఆరు రాష్ట్రాల్లో చక్కర్లు చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మేడ్చల్‌లో పట్టివేత హైదరాబాద్: ప్రేమ పేరుతో వెంటపడి హైదరాబాద్‌లో ఈనెల 14న అక్కాచెల్లెళ్లను హత్య చేసి పరారైన అమిత్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు! ఆరు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టి, సుమారు 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన అతడు.. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తూ మేడ్చల్ వద్ద దొరికిపోయాడు. అడ్వొకేట్కు ఫోన్ చేస్తుండగా సిగ్నల్ గుర్తించిన పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 10 సిమ్‌కార్డులు.. రూ.4 వేలు.. హత్య తర్వాత అమిత్ ఏం చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్లాడన్న వివరాలను పోలీసులు వెల్లడించారు. కొత్తపేటలోని గాయత్రీపురంలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతీ, శ్రీలేఖను వారి ఇంట్లోనే హత్య చేసిన అమిత్‌సింగ్ ఆ తర్వాత తన గదికి వెళ్లాడు. ల్యాప్‌టాప్ తీసుకొని ఆటోలో ఉప్పల్‌కు చేరుకున్నాడు. శ్రీలేఖ, యామినిని హత్య చేశానని, ఇక తాను బతకనని తండ్రికి ఫోన్ చేసి చెప్పి స్విచ్ఛాఫ్ చేశాడు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి నాలుగు సిమ్‌కార్డులు కొన్నాడు. అప్పటికే అతడి దగ్గర ఆరు సిమ్‌లు ఉన్నాయి. ఇలా మొత్తం 10 సిమ్ కార్డులతోపాటు స్నేహితుల నుంచి తీసుకున్న రూ.4 వేలతో ఖాజీపేటకు వెళ్లాడు. అక్కడ్నుంచి నాగపూర్‌కు, మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీకి మరో ైరె ల్లో వెళ్లాడు. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో సొంతూరైన మథుర చేరుకున్నాడు. అయితే అక్కడ పోలీసులు ఉంటారని అనుమానించి అగ్రాకు వెళ్లాడు. అక్కడ్నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లి అజ్మీర్ దర్గాకు చేరుకున్నాడు. అక్కడ ఆత్మలతో మాట్లాడే బాబాలను కలసి శ్రీలేఖతో మాట్లాడించాలని కోరాడు. అయితే ఇప్పుడు ఆత్మ రాదు..40 రోజులకు వస్తుందని బాబాలు చెప్పారు. ఖర్చులు సరిపోకపోవడంతో అప్పటికే ల్యాప్‌టాప్‌ను రూ.12 వేలకు అమ్మాడు. తర్వాత జోధ్‌పూర్‌కు వెళ్లి.. అటు నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నాడు. తర్వాత మధ్యప్రదేశ్‌లోని డీనాకు వెళ్లాడు. అక్కడ్నుంచి బస్సెక్కి షిర్డీ వెళ్లి, మూడ్రోజులు ఉన్నాడు. అక్కడ కూడా ఆత్మలతో మాట్లాడే బాబాల వద్దకు వెళ్లి, వీలుకాకపోవడంతో మన్మాడ్‌లో రెలైక్కి మళ్లీ మథురకు వె ళ్లిపోయాడు. లొంగిపోయేందుకు బయల్దేరి.. పోలీసులు గాలిస్తున్నారన్న సమాచారం అందడంతో ఆగ్రాలో దిగిన అమిత్.. అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిరోజాబాద్‌కు వెళ్లాడు. ఆదివారం ఉదయం అక్కడికి తండ్రిని పిలిపించుకున్నాడు. అక్క, బావతో పాటు తల్లి, చెల్లి పోలీసులు అదుపులో ఉన్నారని తండ్రి ద్వారా తెలుసుకున్న అమిత్ సింగ్.. లొంగిపోవాలనుకున్నాడు. హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఫిరోజాబాద్ నుంచి నిజామాబాద్ వరకు క్వాలిస్‌లో వచ్చిన అమిత్ సింగ్ అక్కడే ప్లాన్ మార్చాడు. ఎవరైనా చూస్తే కొట్టి చంపేస్తారన్న భయం, పోలీసులకు దొరికిపోతాననే అనుమానంతో అంబులెన్స్‌ను కిరాయికి మాట్లాడుకున్నాడు. రోగిగా హైదరాబాద్‌కు బయలుదేరాడు. నగర శివారు మేడ్చల్‌కు రాగానే అడ్వొకేట్కు ఫోన్ చేశాడు. ఫోన్‌కాల్స్ ఆధారంగా మేడ్చల్ పోలీసులు మంగళవారం ఉదయం పది గంటలకు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులకు హోంమంత్రి పరామర్శ యామిని సరస్వతి, శ్రీలేఖ తల్లిదండ్రులు హైమావతి, కృష్ణారెడ్డిలను మంగళవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్‌లు పరామర్శించారు. అక్కాచెల్లెళ్ల చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన బిడ్డలను హత్య చేసిన అమిత్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చైతన్యపురి పోలీసులు అమిత్‌సింగ్‌పై ఐపీసీ 452, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. -
ఆ ఉన్మాది ఎక్కడ?
♦ ఇంకా దొరకని అక్కాచెల్లెళ్లను హత్యచేసిన నిందితుడు అమిత్‌సింగ్ ♦ పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట గాయత్రీపురంలో జంట హత్యలు జరిగి వారం కావస్తున్నా నిందితుడు అమిత్ సింగ్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. రోజురోజుకు అత్యాధునిక సాంకేతిక సేవలతో మన ముందుకు వస్తున్న సైబరాబాద్ పోలీసులు...గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని ఈ 21 ఏళ్ల కుర్రాడిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. భారీ చోరీ జరిగితే 24 గంటలు గడవక ముందే దొంగలను పట్టుకున్నామంటూ ప్రెస్మీట్లు పట్టి మరీ చెప్పే సిటీ పోలీసులు...ఇద్దరు యువతులను కర్కశంగా చంపిన అమిత్‌సింగ్ జాడ కనిపెట్టలేకపోవడం విడ్డూరం. ఇది మన పోలీసుల వైఫల్యమనుకోవాలా? లేక అమిత్ తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నాడనుకోవాలా?...ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది. పురోగతి లేదు... అమిత్‌సింగ్ తండ్రి అమర్‌సింగ్, తల్లితో పాటు చెల్లెలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు...మరిన్ని వివరాలు రాబట్టేందుకు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అమిత్ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్ఛాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. హత్య చేసిన తర్వాత ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లిన అమిత్ ఢిల్లీలో ఉండే పెద్దమ్మ కూతురి వద్దకు రైల్లో వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేదు. ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడ ఉండే అవకాశముందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఎనిమిది మంది హైదరాబాద్ పోలీసుల బృందం...ఢిల్లీలో అమిత్‌సింగ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినా ఫలితం దక్కలేదు. చనిపోయాడా? ‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డొచ్చిన యామిని సరస్వతీని కూడా హత్యచేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’ అని చివరిసారిగా తండ్రి అమర్‌సింగ్‌తో అన్నట్టు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అమిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ అలా జరిగితే ఇప్పటికే మన పోలీసులకు మృతదేహం దొరికిపోయేది. హత్య జరిగి ఆరు రోజులైనా అమిత్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది. గతంలో ఏ మాత్రం నేరచరిత లేని అమిత్ తెలివిగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి సిటీ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లాడనడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం ఉదయం 8. 40 గంటలకు హత్య చేసిన అమిత్ జాడ ఇప్పటివరకు కచ్చితంగా గుర్తించలేని పోలీసులు...అతడి బ్యాంక్ ఖాతా లావాదేవీలపై కన్నేసినా ఎలాంటి పురోగతి లేదు. అమిత్‌తో చనువుగా ఉండే స్నేహితులందరినీ ప్రశ్నించినా ఏ మాత్రం ప్రయోజనం కనబడటం లేదు. పట్టుకుంటాం... అమిత్‌సింగ్‌ను అరెస్టు చేసి తీరుతామని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది అదే పనిలో ఉన్నారని, సాంకేతికత ఆధారంగా అమిత్ ఎక్కడున్నాడో గుర్తించగలిగామన్నారు. రెండు రోజుల్లో తప్పక అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి భరోసా కరువు.. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యామిని సరస్వతీ, శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రస్తుతం హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు బిడ్డలనూ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్న వీరిని ప్రభుత్వం నుంచి పరామర్శించేవారే కరవయ్యారు. మేమున్నామనే భరోసా ఇచ్చేవారు కానరావడం లేదు. పుష్కరఘాట్లలోను, మొక్కలు నాటుతూ...ఇలా ఎక్కడబడితే అక్కడ కనిపించే మన మంత్రులకు...ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి ఆక్రందనలు మాత్రం వినిపించడంలేదు. చనిపోయినా చూపునిచ్చారు అమిత్ సింగ్ చేతిలో హతమైన శ్రీలేఖ, యామిని సరస్వతీ కళ్లు దానం చేశారు. తాము చనిపోయి ఇతరులకు చూపునిచ్చారు. అటువంటి మంచివారిని పొట్టనబెట్టుకున్న హంతకుడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం బాధనిపిస్తోంది. అయినా మాకు చట్టంపైనా గౌరవముంది. హంతకుడికి కఠిన శిక్ష విధించాలని మృతుల బంధువు లక్ష్మీ ప్రసన్న డిమాండ్ చేశారు. -
బాలికపై అత్యాచారం.. అమెరికాకు భారతీయుడి అప్పగింత
పాఠశాలకు వెళ్తున్న టీనేజి అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసు (2009)లో ఓ భారతీయుడిని ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. అమిత్ సింగ్‌ను నేరగాళ్ల మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతదేశం అమెరికాకు అప్పగించింది. అత్యాచారం, లైంగిక వేదింపులు, పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడం లాంటి నేరాల కింద అతడిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే అతడికి జడ్జి యాంజెలో డెలిగటి రిమాండ్ విధించారు. ఈనెల 11న మళ్లీ విచారణ నిమిత్తం కోర్టు ముందుకు అమిత్ వస్తాడని నసావు కౌంటీ జిల్లా అటార్నీ కాథలీన్ రైస్ తెలిపారు. నేరాలు నిరూపితమైతే అతడికి 25 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్తున్న బాలిక (14)పై 2009 మార్చి 11వ తేదీన అమిత్ సింగ్ అత్యాచారం చేశాడు. ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె నిరాకరించగా బలవంతంగా తీసుకపెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి, అనంతరం స్కూలు వద్ద విడిచిపెట్టాడు. బాధితురాలు ఒక టీచర్‌కు ఈ విషయం తెలిపింది. ఐదురోజుల అనంతరం అమిత్ సింగ్ అమెరికా నుంచి భారత్ వచ్చేశాడు. ఆ తర్వాతి రోజే బాధితురాలు అతడి ఫొటోను పోలీసుస్టేషన్లో గుర్తించింది. అమిత్ సింగ్ ఆ బాలికను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించి, ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయవాది రైస్ తెలిపారు. ఈ కేసును పలు సంస్థలు దర్యాప్తు చేసి, ఎట్టకేలకు అమిత్ సింగ్‌ను అరెస్టు చేసి అమెరికాకు తీసుకొచ్చాయి. డీఎన్ఏ శాంపిళ్లను కూడా పోల్చి చూసి అతడి నేరాన్ని నిర్ధారించాయి. అతడిపై ఇంటర్‌పోల్ సంస్థ 2011 ఫిబ్రవరిలో అంతర్జాతీయ వారంటు జారీచేసింది. -
క్రికెటర్ నుంచి బుకీ... అమిత్ సింగ్
కర్ణాటకలో జన్మించి గుజరాత్‌కు ఆడిన 30 ఏళ్ల అమిత్ సింగ్ 2009 నుంచి 2012 వరకు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అంతకుముందు కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అమిత్ తాను ఆడిన తొలి ఐపీఎల్ ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీయడంతో అప్పటి కెప్టెన్ వార్న్ ప్రశంసలు పొందాడు. ఆ సీజన్లోనే రెండు సార్లు అనుమానాస్పద బౌలింగ్ శైలితో వార్తల్లోకెక్కాడు. 2012లో అమిత్‌ను రాజస్థాన్ వదులుకుంది. అనంతరం బుకీ అవతారమెత్తి నిషేధం ఎదుర్కొన్నాడు.