
ఆశలు సజీవం
చాంపియన్స్ లీగ్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ విజయాల బోణీ చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో లయన్స్‌ను చిత్తు చేసింది. ముంబై ప్రస్తుతానికి రేసులో నిలిచినా...ఇతర జట్ల ఫలితాలపైనే జట్టు నాకౌట్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. తాజా పరాజయంతో హైవెల్డ్ లయన్స్ చాంపియన్స్ లీగ్ టి20 నుంచి నిష్ర్కమించింది.
జైపూర్: ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు సీఎల్‌టి20లో తొలి విజయం దక్కింది. శుక్రవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో హైవెల్డ్ లయన్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది.
పీటర్సన్ (27 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రిటోరియస్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ముంబై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (47 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ముంబైని గెలిపిం చాడు. పొలార్డ్ (20 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతనికి సహకరించాడు.
మెరుపులే లేవు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లయన్స్ ఇన్నింగ్స్ ఆద్యంతం పడుతూ, లేస్తూ సాగింది. ముంబై బౌలర్లు రిషి ధావన్, హర్భజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశారు. ఫలితంగా లయన్స్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో కెప్టెన్ పీటర్సన్, ప్రిటోరియస్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
స్మిత్ జోరు
ముంబై ఇండియన్స్ కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తన్వీర్ వేసిన అద్భుతమైన బంతికి సచిన్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (13), రోహిత్ శర్మ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అయితే మరో వైపు డ్వేన్ స్మిత్ మాత్రం తన జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ చేశాడు.
స్కోరు వివరాలు:
హైవెల్డ్ లయన్స్ ఇన్నింగ్స్: డూసెన్ (సి) రిషి ధావన్ (బి) జాన్సన్ 13; డి కాక్ (ఎల్బీ) (బి) హర్భజన్ 19; మెకెంజీ (బి) రిషి ధావన్ 15; సైమ్స్ (బి) ఓజా 14; పీటర్సన్ (నాటౌట్) 35; తన్వీర్ (సి) స్మిత్ (బి) ఓజా 2; ప్రిటోరియస్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1-29; 2-41; 3-62; 4-71; 5-81.
బౌలింగ్: జాన్సన్ 4-0-33-1; కౌల్టర్ 4-0-25-0; రిషి ధావన్ 4-1-21-1; హర్భజన్ 4-0-19-1; ఓజా 3-0-26-2; పొలార్డ్ 1-0-12-0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (నాటౌట్) 63; సచిన్ (బి) తన్వీర్ 5; కార్తీక్ (సి) పీటర్సన్ (బి) తాహిర్ 13; రోహిత్ (సి) (సబ్) బావుమా (బి) ప్రిటోరియస్ 20; పొలార్డ్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 141.
వికెట్ల పతనం: 1-15; 2-47; 3-90;
బౌలింగ్: తన్వీర్ 3.3-0-15-1; సోట్సోబ్ 3-0-25-0; విల్‌జోన్ 4-0-36-0; తాహిర్ 4-0-23-1; ఫాంగిసో 1-0-10-0; ప్రిటోరియస్ 3-0-26-1.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
టైటాన్స్ x సన్‌రైజర్స్
సా. గం. 4.00 నుంచి
బ్రిస్బేన్ x చెన్నై
రా. గం. 8.00 నుంచి
వేదిక: రాంచీ
స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం