ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: గతేడాది ఐపీఎల్ సీజన్లో రికార్డు ధర పలికిన ఆటగాడు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను నిజం చేసినా స్టోక్స్ గతేడాది ధర రూ.14.5 కోట్లను అందుకోలేక పోయినా రికార్డు ధరతో అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశాడు. పలు ఫ్రాంచైజీలు స్టార్ ఆల్ రౌండర్ కోసం వేలంలో పోటీ పడగా చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 12.5 కోట్లకు బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో నేటి వేలంలో ఇప్పటివరకూ అత్యధిక ధర స్టోక్స్‌దే కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్ తమ ఆటగాడు కీరన్ పోలార్డ్‌పై మరోసారి నమ్మకం ఉంచింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన పోలార్డ్ ను నీతా అంబానీ ఫ్రాంచైజీ ముంబై రూ. 5.4 కోట్లకు దక్కించుకుంది. గతంలో ఎన్నో విజయాలు అందించిన పోలార్డ్ ఈ ఐపీఎల్‌లోనూ కీలకం కానున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ధావన్‌ను రూ. 5.2 కోట్లకు, అశ్విన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.6 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment