
నేడు ఐపీఎల్-8 ఆటగాళ్ల వేలం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ కోసం నేడు (సోమవారం) ఆటగాళ్ల వేలం జరుగనుంది. డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా స్టార్ ఆరోన్ ఫించ్ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. గతేడాది వేలంలో యువీని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అనూహ్యంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంచనాలకు తగ ్గట్టు రాణించకపోవడంతో యువీని ఆ జట్టు వదులుకుంది.
వీరితో పాటు ఢిల్లీ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, దినేశ్ కార్తీక్ కనీస ధర రూ.2 కోట్లుగా ఉంది. ఈ సీజన్ కోసం 122 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు తమ దగ్గరే అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 78 మంది భారత్, 44 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఒక్కో జట్టు ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 63 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఇది గత సీజన్‌కన్నా 5 శాతం ఎక్కువ. ఈ కార్యక్రమం సోనీ సిక్స్ ఎస్‌డీ, హెచ్‌డీ చానెల్స్‌లో ఉదయం 9.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.