అంతా లీగ్‌ల మయం | Everything League magic | Sakshi
Sakshi News home page

అంతా లీగ్‌ల మయం

Published Wed, Jan 22 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

Everything League magic

 మెల్‌బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతమైన తీరు దేశంలోని ఇతర క్రీడలనూ విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ బాటలో బ్యాడ్మింటన్, హాకీ లీగ్‌లు అభిమానులు ఆకట్టుకుంటుండగా తాజాగా టెన్నిస్, రెజ్లింగ్‌లోనూ రాబోతున్నాయి. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట భారత్‌కు చెందిన డబుల్స్ స్టార్ మహేశ్ భూపతి, జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్ ఆధ్వర్యంలో ఓ టోర్నీ రాబోతుంది.
 
 గత మేలోనే ఐపీటీఎల్‌ను లాంఛనంగా ప్రకటించారు. లీగ్‌లో ఐదు జట్లు పాల్గొంటాయి.
  ముంబై, బ్యాంకాక్, సింగపూర్, కౌలాలంపూర్‌లతో పాటు మధ్య ప్రాచ్య దేశంలోని ఓ నగరం పేరును త్వరలో ప్రకటించనున్నారు.
 
  పురుషులు, మహిళా ఆటగాళ్లతో కలిసి ఉండే ఈ జట్లు అత్యంత నాణ్యమైన టెన్నిస్‌ను అభిమానులకు అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఆసీస్ ఆటగాడు లీటన్ హెవిట్ ఇప్పటికే ఈ లీగ్‌కు తన అంగీకారాన్ని తెలిపాడు. 2014 ఫిఫా ప్రపంచకప్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్‌లాంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లను ప్రసారం చేసే ఎంపీ అండ్ సిల్వ ఈ లీగ్ ప్రసార హక్కులు తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement