badminton league
-
హైదరాబాద్‌లో పీబీఎల్ సెమీస్, ఫైనల్స్
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట బెంగళూరు అంచె పోటీలను (ఫిబ్రవరి 5 నుంచి 6 వరకు), అనంతరం 7, 8వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్‌తో పాటు 9న జరిగే ఫైనల్ పోరును బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగేలా షెడ్యూల్‌ను తయారు చేశారు. అయితే ఆ సమయంలో స్టేడియం అందుబాటులో ఉండడం లేదని... దాంతో అక్కడ మ్యాచ్‌లను నిర్వహించడం కష్టం అంటూ బెంగళూరు రాప్టర్స్ జట్టు గురువారం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. దీంతో బెంగళూరు అంచె మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తూ పీబీఎల్ నిర్వాహకులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయి. ఫలితంగా పీబీఎల్ తాజా సీజన్లో హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. మొదట హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉండగా... ప్రస్తుతం అది ఫిబ్రవరి 9వ తేదీ వరకు పొడిగించారు. పీబీఎల్ ఐదో సీజన్ ఈ నెల 20న చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది. 24 వరకు చెన్నైలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 25 నుంచి 28 వరకు లక్నో అంచె పోటీలు ఉంటాయి. -
బెంగళూరు రాప్టర్స్ గెలుపు
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్ 3–2తో చెన్నై స్మాషర్స్‌పై గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్ అహ్సాన్– సథియావాన్ (బెంగళూరు) జంట 15–14, 9–15, 11–15తో క్రిస్ అడ్కాక్– చిన్ చుంగ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం చెన్నై ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో ప్రణీత్ (బెంగళూరు) 15–11, 15–12తో కశ్యప్‌పై గెలుపొందడంతో స్కోరు 1–0గా మారింది. బెంగళూరు ట్రంప్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 15–10, 15–10తో వీ ఫెంగ్ చోంగ్ (చెన్నై)పై గెలుపొందడంతో బెంగళూరు 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో థి త్రాంగ్‌వు 10–15, 15–14, 10–15తో సుంగ్ జీ హ్యూన్ (చెన్నై) చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో ఎలిస్– స్మిత్ జంట 8–15, 15–12, 4–15తో క్రిస్ అడ్కాక్– గాబ్రియెల్ అడ్కాక్ (చెన్నై) జోడీ చేతిలో ఓడినప్పటికీ 3–2తో విజయం బెంగళూరు వశమైంది. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో బెంగళూరు రాప్టర్స్ తలపడుతుంది. -
సెమీస్‌లో ముంబై రాకెట్స్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో ముంబై రాకెట్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐదు జట్లతో తలపడిన ముంబై మూడింటిపై గెలిచి 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ముంబై 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆండెర్స్ ఆంటోన్సెన్ 15–14, 15–11తో రాజీవ్ ఒసెఫ్‌పై గెలిచాడు. చెన్నై ‘ట్రంప్’మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ కిమ్ జీ జాంగ్–బెర్నాడ్త్ (ముంబై) జంట 15–14, 15–14తో క్రిస్ అడ్కాక్–గాబ్రియల్ అడ్కాక్ జోడీపై గెలవడంతో ముంబై 2–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్‌లో చెన్నై ప్లేయర్ సుంగ్ జీ హ్యూన్ 15–7, 15–8తో అనురా ప్రభుదేశాయ్‌పై నెగ్గింది. ముంబై ‘ట్రంప్’అయిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 12–15, 15–13, 15–9తో పారుపల్లి కశ్యప్‌పై గెలిచి 4–0తో విజయాన్ని ఖాయం చేశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో కిమ్ జీ జాంగ్–లీ యాంగ్ డై జోడీ 15–8, 15–10తో ఆర్ చిన్ చుంగ్–సుమీత్ రెడ్డి ద్వయంపై గెలిచి 5–0తో ముగించింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్ 4–3తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై గెలిచింది. నేడు ఢిల్లీ డాషర్స్‌తో పుణే సెవెన్ ఏసెస్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్‌తో తలపడతాయి. -
చెన్నై స్మాషర్స్ గెలుపు
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై స్మాషర్స్ 4–3తో పుణే సెవెన్ ఏసెస్‌పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ చెన్నై ట్రంప్ మ్యాచ్‌లో క్రిస్ అడ్కాక్–గ్యాబ్రియెల్ జంట 15–13, 15–14తో ఇవనోవ్–జాయెర్స్‌ఫెల్డ్ (పుణే) జోడీపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (చెన్నై) 15–6, 8–15, 15–13తో లెవెర్డెజ్ (పుణే)ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో సంగ్ జి హ్యున్ (చెన్నై) 15–14, 7–15, 15–13తో మారిన్ (పుణే)కు షాకిచ్చింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ (పుణే) 13–15, 15–7, 15–11తో వీ ఫెంగ్ చోంగ్‌పై నెగ్గాడు. పుణే ట్రంప్ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–చిరాగ్ శెట్టి జోడీ 15–14, 15–9తో క్రిస్ అడ్కాక్–సుమిత్ రెడ్డి (చెన్నై) జంటపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్మాస్టర్స్తో అవధ్ వారియర్స్ పోటీపడుతుంది. -
నార్త్ ఈస్టర్న్ వారియర్స్ బోణీ
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ బోణీ చేసింది. గురువారం జరిగిన పోరులో 4–1తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సభ్యురాలైన భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. మిక్స్డ్ డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో నార్త్ ఈస్టర్న్ జంట లియావో మిన్ చన్–కిమ్ హ న 15–6, 15–13తో కిమ్ జి జంగ్–పియ జబదియా (ముంబై) జోడీపై గెలిచింది. ముంబై ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెన్సోమ్బున్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–9, 10–15, 15–11తో అంటోన్సెన్ను కంగుతినిపించడంతో ముంబై –1 స్కోరుకు పడిపోయింది. తర్వాత మహిళల సింగిల్స్ వారియర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో రీతుపర్ణ దాస్ 12–15, 15–10, 15–12తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో నార్త్ ఈస్టర్న్ 4–(–1)తో మరో రెండు మ్యాచ్‌లుండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. రెండో పురుషుల సింగిల్స్‌లో టియాన్ హౌవీ (నార్త్ ఈస్టర్న్) 6–15, 13–15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో పరాజయం చవిచూడగా, పురుషుల డబుల్స్‌లో లియావో మిన్ చన్–యు ఇయాన్ సియంగ్ (నార్త్ ఈస్టర్న్) ద్వయం 12–15, 15–13, 7–15తో కిమ్ జి జంగ్–లీ యంగ్ డే (ముంబై) చేతిలో ఓడింది. శుక్రవారం జరిగే పోటీల్లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో బెంగళూరు రాప్టర్స్, హైదరాబాద్ హంటర్స్‌తో అవధ్ వారియర్స్ తలపడతాయి. -
హైదరాబాద్ స్మాషర్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ స్మాషర్స్ జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్మాషర్స్ 4–1తో ఎన్తు షట్లర్స్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఎన్తు షట్లర్స్ 4–3తో బీబీఏ టైటాన్స్‌పై గెలుపొందగా... హైదరాబాద్ స్మాషర్స్ 4–2తో ముంబై మాస్టర్స్‌ను ఓడించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ టీవీఎన్ రాజేశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీకి కృషి
– రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ – అట్టహాసంగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు ప్రారంభం – కర్నూలులో క్రీడాకారుల మోటార్ సైకిల్ ర్యాలీ కర్నూలు (టౌన్): కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. బుధవారం.. టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను పురస్కరించుకొని స్థానిక మౌర్య ఇన్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారుల ర్యాలీని టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మౌర్య ఇన్, రాజ్‌విహార్ సర్కిల్, జిల్లా పరిషత్తు, గాంధీనగర్, విద్యానగర్, కిడ్స్ వరల్డ్, కోట్ల సర్కిల్ మీదుగా ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఇండోర్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. భారత దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఎనలేని ప్రాచుర్యం లభించిందన్నారు. రాష్ట్ర స్థాయిలో లీగ్ పోటీలు నిర్వహించడంతో కర్నూలులో ఈ క్రీడ అభివృద్ధిఖఙ అవకాశం ఏర్పడుతుందన్నారు. టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ టీజీ భరత్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా సౌత్‌జోన్ స్థాయి వరకు ఆడిన తాను ఈ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. క్రికెట్ తరహాలో ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకురావాలని కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని క్రీడలను సమాన అవకాశాలు కల్పించాలన్నారు. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను నిర్వహించడం కర్నూలుకే గర్వకారణమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 60 మంది క్రీడాకారులను వేలం ద్వారా కోనుగోలు చేసి లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడలో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో రాయలసీమ వారియర్స్, వైజాగ్ ఎసర్స్, గోదావరి గన్స్ తదితర టీమ్‌లు తలపడనున్నాయి. గెలుపొందిన వారికి రూ. 10 లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, రవికిరణ్, శ్రీనివాస భట్, వంశీ, రవికళాధర్ రెడ్డి పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్‌కు బాజా మోగింది...
సాక్షి హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. లీగ్ విశేషాలను వెల్ల డిస్తూ నిర్వాహకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. టోర్నీలో పాల్గొంటున్న భారత షట్లర్లు ఇందులో పాల్గొన్నారు. పీబీఎల్ నిర్వాహకులు ‘స్పోర్ట్స్ లైవ్’ ప్రతినిధి ప్రసాద్‌తో ఆటగాళ్లు (వరుసగా) రుత్విక శివాని, సుమీత్ రెడ్డి, సౌరభ్ వర్మ, అరుంధతి, పీవీ సింధు, శ్రీకాంత్, సారుుప్రణీత్, సమీర్‌వర్మ, సిరిల్ వర్మ, వృషాలి మీడియా సమావేశంలో ఉన్నారు. -
మారిన్‌కు అత్యధిక మొత్తం
► రూ. 61.5 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ హంటర్స్ ► భారత్ తరఫున ఖరీదైన క్రీడాకారుడిగా శ్రీకాంత్ ► రూ. 51 లక్షలకు కొనుగోలు చేసిన అవధ్ వారియర్స్ ► సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ వేలం కార్యక్రమంలో విదేశీ క్రీడాకారుల హవా నడిచింది. భారత స్టార్స్‌కంటే ఎక్కువ మొత్తం వీరి ఖాతాలోకి వెళ్లడం విశేషం. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు అందరికంటే అత్యధిక మొత్తం లభించింది. హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 61.5 లక్షలు వెచ్చించి మారిన్‌ను సొంతం చేసుకుంది. మారిన్ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జీ హున్‌కు భారీ మొత్తం లభించింది. సుంగ్ జీ హున్‌ను ముంబై రాకెట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు జాన్ జార్గెన్‌సన్ ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. జార్గెన్‌సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు రూ. 59 లక్షలకు సొంతం చేసుకుంది. పీబీఎల్ తొలి సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మలేసియా స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ఈసారి పీబీఎల్‌లో పాల్గొనడంలేదు. చైనా స్టార్స్ చెన్ లాంగ్, లిన్ డాన్ కూడా పీబీఎల్‌కు దూరంగా ఉన్నారు. భారత్ తరఫున కిడాంబి శ్రీకాంత్‌కు అత్యధిక మొత్తం దక్కింది. అవధ్ వారియర్స్ రూ. 51 లక్షలకు శ్రీకాంత్‌ను కొనుగోలు చేసింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధును చెన్నై స్మాషర్స్ జట్టు... సైనా నెహ్వాల్‌ను అవధ్ వారియర్స్ తమ వద్దే ఉంచుకున్నాయి. సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు లభించనున్నాయి. భారత్‌కే చెందిన ఇతర ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్ (రూ. 22 లక్షలు-ముంబై రాకెట్స్), గుత్తా జ్వాల (రూ. 10 లక్షలు-ఢిల్లీ ఏసర్స్), అశ్విని పొన్నప్ప (రూ. 15 లక్షలు-బెంగళూరు బ్లాస్టర్స్), పారుపల్లి కశ్యప్ (రూ. 8 లక్షలు-చెన్నై స్మాషర్స్)లను నామమాత్రం మొత్తానికే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. పీబీఎల్-2 సీజన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరగనుంది. మొత్తం ఆటగాళ్ల వివరాలు అవధ్ వారియర్స్: కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, ఆదిత్య జోషి, ప్రాజక్త సావంత్, విషెమ్ గో, సావిత్రి అమిత్రపాయ్, వోంగ్ వింగ్ కీ విన్సెంట్, బోదిన్ ఇసారా, మార్కిస్ కిడో. ముంబై రాకెట్స్: అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, మనూ అత్రి, గుమ్మడి వృశాలి, మొహితా, అభిషేక్ యెలెగర్, లీ యోంగ్ డే, సుంగ్ జీ హున్, నాదెజ్దా జీబా, నిపిత్‌ఫోన్. ఢిల్లీ ఏసర్స్: సన్ వాన్ హో, జాన్ జార్గెన్‌సన్, గుత్తా జ్వాల, నిచావోన్ జిందాపోల్, ఇవాన్ సొజోనోవ్, వ్లాదిమిర్ ఇవనోవ్, అక్షయ్ దేవాల్కర్, కె.మనీషా, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, వీ కియోంగ్ తాన్, చౌ హో వా, రాజీవ్ ఉసెఫ్, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, సమీర్ వర్మ, కృష్ణప్రియ, మేఘన, తాన్ బూన్ హెయోంగ్. బెంగళూరు బ్లాస్టర్స్: విక్టర్ అక్సెల్సన్, యో యోన్ సెయోంగ్, అశ్విని పొన్నప్ప, పోర్న్‌టిప్, రుత్విక శివాని, సౌరభ్ వర్మ, ప్రణవ్ చోప్రా, కో సుంగ్ హున్, సిక్కి రెడ్డి, బున్సాక్ పొన్సానా. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, టామీ సుగియార్తో, గ్యాబీ అడ్కాక్, తనంగోసక్, క్రిస్ అడ్కాక్, మాడ్స పీలెర్ కోల్డింగ్, సుమీత్ రెడ్డి, రమ్య తులసీ, అరుంధతి పంతవానె. -
అంతా లీగ్‌ల మయం
మెల్బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతమైన తీరు దేశంలోని ఇతర క్రీడలనూ విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ బాటలో బ్యాడ్మింటన్, హాకీ లీగ్‌లు అభిమానులు ఆకట్టుకుంటుండగా తాజాగా టెన్నిస్, రెజ్లింగ్‌లోనూ రాబోతున్నాయి. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట భారత్‌కు చెందిన డబుల్స్ స్టార్ మహేశ్ భూపతి, జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్ ఆధ్వర్యంలో ఓ టోర్నీ రాబోతుంది. గత మేలోనే ఐపీటీఎల్ను లాంఛనంగా ప్రకటించారు. లీగ్‌లో ఐదు జట్లు పాల్గొంటాయి. ముంబై, బ్యాంకాక్, సింగపూర్, కౌలాలంపూర్లతో పాటు మధ్య ప్రాచ్య దేశంలోని ఓ నగరం పేరును త్వరలో ప్రకటించనున్నారు. పురుషులు, మహిళా ఆటగాళ్లతో కలిసి ఉండే ఈ జట్లు అత్యంత నాణ్యమైన టెన్నిస్‌ను అభిమానులకు అందిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఆసీస్ ఆటగాడు లీటన్ హెవిట్ ఇప్పటికే ఈ లీగ్‌కు తన అంగీకారాన్ని తెలిపాడు. 2014 ఫిఫా ప్రపంచకప్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్లాంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లను ప్రసారం చేసే ఎంపీ అండ్ సిల్వ ఈ లీగ్ ప్రసార హక్కులు తీసుకుంది.