న్యూఢిల్లీ: ఇండి యన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఫిక్సింగే జరగలేదని, తన పాత్ర ఏమీ లేకపోయినా పూర్తిగా తప్పుడు కేసులో ఇరికించారని అజిత్ చండీలా వ్యాఖ్యానించాడు. ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చండీలా...‘నేను సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లాంటి మేటి క్రికెటర్ల వికెట్లు తీశాను.
నా ప్రదర్శన చూస్తే చాలు నేనే తప్పూ చేయలేదని తెలుస్తుంది. పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే’ అన్నాడు. రెండు నిమిషాలు అజ్ఞాత వ్యక్తులతో మాట్లాడటం తనను దోషిగా రుజువు చేయలేదని, త్వరలోనే నిజాయితీ నిరూపించుకుంటానని చండీలా చెప్పాడు. మరో వైపు ఫిక్సింగ్‌పై విచారణ నిమిత్తం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ అక్రమమా, కాదా అన్న అంశంపై విచారణను సుప్రీం కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
ఫిక్సింగే లేదు: చండీలా
Published Fri, Sep 13 2013 12:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement