అన్ని హక్కులూ ఒక్కరికే | BCCI changes IPL bid policy, supporting TV broadcasters | Sakshi
Sakshi News home page

అన్ని హక్కులూ ఒక్కరికే

Published Tue, Oct 18 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

అన్ని హక్కులూ ఒక్కరికే

అన్ని హక్కులూ ఒక్కరికే

మారనున్న ఐపీఎల్ బిడ్డింగ్ విధానం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టెండర్ల ప్రక్రియ పూర్తిగా మారబోతోంది. 2018 నుంచి అన్ని హక్కులూ ఒక్కరికే ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. ఇంతకాలం భారత్‌లో టెలివిజన్ హక్కులు, డిజిటల్ బ్రాడ్‌కాస్ట్, అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్, ఆన్‌లైన్ హక్కులు ఇలా రకరకాల పేర్లతో బిడ్‌లు పిలిచి అనేక సంస్థలకు హక్కులు ఇచ్చారు. ఇకపై అలా కాకుండా అన్ని హక్కులకు కలిపి  ‘కన్సాలిడేటెడ్ బిడ్’ను ఆహ్వానించనుంది. దీని వల్ల స్టార్ ఇండియా, సోనీ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు లబ్ధిచేకూరనుంది.

 ఇందులో ఏదో ఒక సంస్థ ఈ హక్కులన్నీ చేజిక్కించుకునేందుకు మార్గం సులువైంది. మొత్తం మీద ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం లభించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement