పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కంటే ఐపీఎల్‌ చాలా పెద్దది: వసీం అక్రమ్‌ | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కంటే ఐపీఎల్‌ చాలా పెద్దది: వసీం అక్రమ్‌

Published Sun, Dec 31 2023 9:05 AM

PSL Is Like Mini IPL Of Pakistan: Wasim Akram - Sakshi

ఐపీఎల్‌- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్‌ ఐపీఎల్‌లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్‌ రిచ్‌ లీగ్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ సైతం ఐపీఎల్‌కు పోటీగా ఓ టీ20 లీగ్‌(పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌)ను నిర్వహిస్తోంది.

ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్‌ఎల్‌ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్‌ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌నే వరల్డ్‌లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు.

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కంటే ఐపీఎల్‌ చాలా పెద్ద క్రికెట్‌ లీగ్‌ అని అక్రమ్‌ పేర్కొన్నాడు. అక్రమ్‌ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ స్పోర్ట్‌కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్‌ ప్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లో ఐపీఎల్‌ లేదా పీఎస్‌ఎల్‌ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది.

అందుకు బదులుగా.. 'నేను పీఎస్‌ఎల్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్‌ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌. అందులో ఎటువంటి సం‍దేహం​ లేదు. పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు. పీఎస్‌ఎల్‌ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్‌ వంటిది" అని అక్రమ్‌ పేర్కొన్నాడు.
చదవండి#Saumy Pandey: ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో


 

Advertisement
 
Advertisement
 
Advertisement