క్రికెటర్స్ యువరాజ్, హర్భజన్, గంభీర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్లకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. భారీ ధర పలకకున్నా, వారి స్థాయికి తగ్గట్లుగా రూ.4 నుంచి 5 కోట్ల వరకు ధర పలుకుతారని భావించినా కొందరు ఆటగాళ్లకు తీవ్ర నిరాశే ఎదురైంది. హర్భజన్ సింగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ లను పాత ఫ్రాంచైజీలు తీసుకోకపోవడంతో పాటు వారి కొత్త యాజమాన్యాలు కనీస ధరలకే కొనుగోలు కావడం గమనార్హం.
10 సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ఆడిన హర్భజన్ సింగ్ ను చెన్నై సూపర్ కింగ్స్ 2 కోట్లకు, సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 కోట్లకు సొంతం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ 2.8 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది భారీ ధర ఉన్న అజింక్య రహానేను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4 కోట్లకు నమ్మకం ఉంచింది. వ
విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.6 కోట్లకు, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 కోట్ల ధరకు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈ 11వ సీజన్లో చాలామంది ఆటగాళ్ల ధరలు వేలంలో చాలా తగ్గినట్లు కనిపిస్తున్నా.. అనూహ్యంగా కొందరికి భారీ ప్యాకేజీలతో కోనుగోలు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment