
అక్కడ ఏదీ అసంబద్ధం కాదు
బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పనిసరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బలహీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు.
సమకాలీన పట్టణ భారతాన్ని ఈ రెండింటిలో ఏది బాగా దృశ్యీకరించగలుగుతుంది: క్రీడామైదానంలో ప్రజ లు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పటి దృశ్యాలా? ప్రతి ఓవర్ తరువాత ప్రసారంలో విరామం ఇచ్చి, లేదా ఇతర విరామ సమయాలలోనూ చూపించే వ్యాపార ప్రక టనలా? వీటినే ఆడంబరంగా వ్యూహాత్మక విరామాలని కూడా అంటారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పూర్వీకులు చాలా ప్రత్యేకమైనవారు. రోమన్ చక్రవర్తులు పౌరులకి ఆహారంతో పాటు, సర్కస్ విన్యాసాలను అందుబాటు లో ఉంచడం ద్వారా తమ ఉనికిని నిలుపుకోవడం ఎలా గో బాగా తెలిసినవారిగా ప్రసిద్ధికెక్కారు. పురుషుడనే వాడు కేవలం ఆహారంతోనే సరిపుచ్చుకుని బతకలేడు. అదే శుభవార్తను ప్రస్తుతకాలంలో ఆడవారి గురించి కూడా చెప్పవచ్చు. ఇవాళ్టి సర్కస్ ఏమిటో సుస్పష్టమే. ఆ సర్కస్ కూడా అదే విధమైన ప్రయోజనకారి కూడా. క్రికె ట్ స్టేడియంను కూడా అచ్చంగా రోమన్ల గతకాలపు కొలోసియంల మాదిరిగానే నిర్మించారు. పాక్షిక పైకప్పు తప్ప మిగిలిన నిర్మాణంలో పెద్ద మార్పేమీ లేదు.
అయితే హింసాస్వాదన పట్ల ఆధునిక కాలంలో ఉన్న ఆసక్తిలో కొంచెం భేదం ఉంది. అందుకే, మరీ రోమన్ల కాలంలోని గ్లాడియేటర్ యుద్ధవీరులు ధరించిన కవచాల మాదిరిగా కాకుండా, బ్యాట్స్‌మెన్ శిరస్త్రాణాలు ధరిస్తున్నారు. చంపుకోవడం ఇప్పుడు నిషిద్ధం కదా! కాబట్టి పైశాచికానం దాన్ని బ్యాట్స్‌మెన్ (అతడి యుద్ధ విన్యాసాలతో) మరణం కంటే, ఇన్నింగ్స్ మరణం మీదికి మళ్లిస్తున్నారు. అంపైర్‌కి తన బొటనవేలును నేలవైపు చూపడం కంటే, ఆకాశం వైపు చూపడానికే అధికారం ఉంది. రోమన్ కాలపు లక్షణానికీ, దీనికి పెద్ద తేడా లేదు. పాలక వర్గాలవారు ప్రత్యేకమైన బాక్సులలో కూర్చుని క్రీడను తిలకిస్తారు. పౌరులంతా కింద నుంచి పైవరకు శ్రేణులుగా అమర్చిన ఆసనాల మీద సొగసుగా ఆసీనులై ఉంటారు. కెమెరాలు పౌరుల గురించి మనకి ఏం చెబు తాయి?
21వ శతాబ్దపు యువ భారతీయులు ముమ్మాటికీ వారి తండ్రులూ, మామయ్యల కంటే చాలా బాగుంటా రు. ఇది జీవితంలో ఏదో ఒక దశకు సంబంధించి చెబు తున్నది కూడా కాదు. భవిష్యత్తుతో బంధం వల్ల యువకులు ఎప్పుడూ అందచందాలతో ఉంటారు. కానీ వయ సు మీరిన వారు అద్దానికి బందీలవుతారు. ఆరోగ్యం, వెలుగు మనిషి ఉన్నత స్థితిలో ఉన్న కాలాన్ని ప్రతిబిం బిస్తూ ఉంటాయి.
స్త్రీపురుష సమానత్వమన్న ఆలోచనకు సంబంధించి ఒక జాతిగా మనం ఇప్పటికీ దానికి కొంత దూరం గానే ఉన్నాం. అయితే స్త్రీపురుష సహనం మాత్రం ఉంది. దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. 1950, 1960 నాటి సినిమాలలో చూస్తే అమ్మాయిలూ, అబ్బాయిలూ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కూడా విడివిడిగానే కూర్చుని ఉన్నట్టు కనిపిస్తారు. వీటితో పోల్చుకుంటే నేటి యువతరం ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉంటు న్నారనే చెప్పాలి. దీనిని పరిగణనలోనికి తీసుకోకపోతే ఏ రాజకీయవేత్తకు యువతరం ఓట్లు పడవు. అంటే, నైతిక వర్తనవాదులు ఆమోదించిన కాలం చెల్లిన గతాన్ని తప్ప, నాయకులు మరి దేనినీ గెలుచుకోలేరు. ఇది మంచి వార్త.
అయితే భేషజానికి సంబంధించిన వాసనలు మనలను ఇంకా పూర్తిగా వీడిపోలేదు. సంకేతాలను అందుకుని గాలిలో ముద్దులు విసరడానికీ, డబ్బులు తీసుకుని వయ్యారంగా కన్నుగీటడానికి మహిళా చీర్‌లీడర్ల కిరాయి బృందాన్ని ప్రతి ఒక్క క్రికెట్ జట్టు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ బృందంలో ఉండే యువతులంతా విదేశీయులే. బుద్ధిమంతులైన మన బాలికలు అలాంటి కురచ బట్టలలో ఎప్పుడూ కనిపించ కూడదు. ప్రతివారూ ఏం చెబుతారు? ఇలాంటి బృందా లలో కలసి నిలబడడానికి మన అమ్మాయిలను అను మతిస్తే, వాళ్లు చీరలు ధరించి ఏదో సంప్రదాయిక విన్యాసం చేస్తారనే. ఆధునిక వస్త్రధారణ, ఆస్వాదించే కన్ను ఇంటర్వ్యూ పరిధికే పరిమితం. చీర్‌లీడర్‌లు ఉండే చోటులో వీరిని వెతనక్కరలేదు. అయితే ఇందుకు నిరాశ చెందనక్కరలేదు. ఇవాళో రేపో అనే గానీ, అదీ జరుగు తుంది.
దీనికి ఆధారం ఏమిటి? మన వ్యాపార ప్రకటనలే. వాటిలో కనిపిస్తున్న భారతీయ మహిళలు చిన్న చిన్న చెడ్డీలతో కనిపిస్తున్నారు, పురుషుడు అనాఛ్చాదిత వక్షా న్ని ప్రదర్శిస్తున్నాడు. పురుషులు ఉపయోగించే ఒక పెర్ ఫ్యూమ్‌కు సంబంధించిన ఆ వ్యాపార ప్రకటనలో ఒక పురుషుడు ఠీవిగా కెమెరా కేసి నడిచి వస్తాడు. అతడిని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరాధనగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె చెప్పే మాట అస్పష్టంగా ఉంటుంది. నీవు మహిళలను ఆకర్షించడానికీ, నిజానికి మహిళలే నిన్ను ఆకర్షించడానికి ఆ పెర్‌ఫ్యూమ్‌లో మునిగి తేలితే చాలు నన్నదే దాని భావం. ఆ వ్యాపార ప్రకటన ప్రభావం చూపడం అని వార్యం. లేదంటే అది ప్రసారం కాదు.
తెల్లతోలు లేదా శ్వేతవర్ణం దేనినైనా విజయవంతం గా విక్రయించడానికి దోహదపడుతుంది. యూరోపి యన్ బహుళజాతి సంస్థ ఫిలిప్. ఇది తను ఉత్పత్తి చేస్తు న్న ఎలక్ట్రిక్ షేవర్ (గెడ్డం గీసుకునే పరికరం) గురించి ప్రచారం చేయడానికి ఛానెళ్లలో సమయం తీసుకుం టుంది. అందుకు సంబంధించిన వ్యాపార ప్రకటనలో మొదటి దృశ్యం: ముఖమంతా గుబురుతో ముదురు చాక్లెట్ రంగు మనిషి కనిపిస్తాడు. ఇతడు తన గెడ్డాన్ని సంప్రదాయక పద్ధతులలో తొలగించడానికి ప్రయత్నిం చినపుడు అతడి చెంప మీద ఒక మెరుపు వస్తుంది. తరు వాత ఫిలిప్ షేవర్ వస్తుంది. అది అతడి గుబురు గెడ్డాన్ని పరమ సౌఖ్యంగా తొలగించడమే కాదు, ముఖంతో పాటు, భుజాల వరకు కూడా శరీరాన్ని కాంతిమంతం చేస్తుంది. ఈ అద్భుతం పూర్తయ్యే సరికి, అతడి చుబుకం మంచుముద్ద ఒంపు మాదిరిగా నున్నగా తయారవు తుంది. మరుక్షణం అతడు స్థానిక హాలెండ్ వాసిలా రూపుదాలుస్తాడు. నిజానికి అది గెడ్డం గీసుకోవడం అనిపించదు. ఆ పురుషుడు పునరుత్థానం చెందాడని అనిపిస్తుంది.
ఈ వ్యాపార ప్రకటన కూడా తన ప్రభావం చూపు తుంది. లేదంటే అసలు ప్రసారం కాదు. దీనిని బట్టి భారతీయులు కూడా శరీరం లోపలే కాదు, బయట కూడా రంగుకు దాసులేనని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. బహుళజాతి సంస్థలన్నీ రంగుల మాయ చేసేవే. వాటి ప్రధాన ధ్యేయం లాభాలు పెంచుకోవడమే. ఈ ప్రకటనలేవీ కూడా పక్షపాత దృష్టిని కల్పించవు, లేదా ప్రోత్సహించవు. అయితే ఎవరి వెర్రితనం మీదనైనా డబ్బు సంపాదించే మార్గాలు ఉంటే వాటిని తప్పని సరిగా అవి ఉపయోగించుకుంటాయి. అలాగే మన బల హీనతను సొమ్ము చేసుకునే విధంగానే ప్రకటనలలోని కళాత్మకత అంతా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఉండే భ్రాంతులను లాభాలుగా మార్చుకునే విద్యలు పెద్ద పెద్ద కంపెనీలకు బాగా తెలుసు. కాబట్టి కంపెనీలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించవద్దు. వినియోగ దారు డనే మన బంగారం మంచిదైతే అదే చాలు.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు ఎం.జె.అక్బర్)