
ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్ చేతిలో పరాజయం అనంతరం ఆ దేశ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా తుది జట్టు ఎంపికపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో ఎవరెవరు ఉండాలో కనీసం కోచ్‌కైనా పూర్తి అవగాహణ ఉండాలని చవాక్కులు పేలాడు. తుది జట్టు ఎంపికలో ఇంత గందరగోళం ఏంటని ప్రశ్నించాడు. 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ నానా అవస్థలు పడుతుందని, జట్టు కూర్పు విషయంలో యాజమాన్యం, కోచ్‌కు ఓ క్లారిటీ ఉండాలని బిల్డప్ ఇచ్చాడు. ఓ ఆటగాడు విఫలమైతే లేదా గాయపడితే ప్రత్యామ్నాయ ఆటగాడిని ముందే ఎంచుకోవాలని అనవసర సలహాలు ఇచ్చాడు.
గాయం కారణంగా రవీంద్ర జడేజా, అనారోగ్యం కారణంగా ఆవేశ్ ఖాన్‌లు జట్టుకు దూరమైన నేపథ్యంలో వారి స్థానాల్లో సంబంధిత స్పెషలిస్ట్‌లను జట్టులోకి తీసుకోవాలి కాని.. అనవసర మార్పులు, చేర్పులు చేసి చేతులు కాల్చుకుందని అన్నాడు. స్పెషలిస్ట్ వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్ కోటాలో ఎంపిక చేసుకున్న దినేశ్ కార్తీక్‌ను పక్కకు పెట్టి ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకోవడమేంటని అవగాహన లేకుండా పేలాడు.
ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడాను తీసుకున్నప్పుడు అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడమేంటని ప్రశ్నించారు. మొత్తంగా సూపర్-4 దశలో పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ఎంపిక గందరగోళంగా ఉందని అన్నాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ వేదికగా అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, భారత్-పాక్‌ల మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో.. పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది అనడం కంటే.. టీమిండియా పరాజయంపాలైందని అనడమే బెటరని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!