Virat Kohli Becomes First Cricketer To Reach 50 Million Followers On Twitter - Sakshi
Sakshi News home page

Virat Kohli: తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత!

Published Tue, Sep 13 2022 1:02 PM | Last Updated on Tue, Sep 13 2022 4:14 PM

Virat Kohli Becomes First Cricketer To Reach 50 Million Followers On Twitter - Sakshi

తన సతీమణి అనుష్క శర్మతో విరాట్‌ కోహ్లి(PC: Virat Kohli Twitter)

Virat Kohli On Twitter: టీమిండియా మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రికార్డుల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌లో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికే 71 సెంచరీలు సాధించాడు ఈ రన్‌మెషీన్‌. కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన కింగ్‌.. ఆసియా కప్‌-2022లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో సత్తా చాటి మునుపటి కోహ్లిని గుర్తు చేశాడు. 

సోషల్‌ మీడియాలో కోహ్లి హవా!
కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసి తన విలువ చాటుకున్నాడు. తనదైన ఆట తీరుతో రోజురోజుకీ అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా మరో రికార్డు సాధించాడు కోహ్లి. అయితే, ఈసారి ఆటలో కాకుండా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌లో కోహ్లి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ట్విటర్‌లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో..
ఇక..  ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లికి 211 మిలియన్‌ మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే విధంగా ఫేస్‌బుక్‌లో 49 మిలియన్‌ మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. దీంతో.. సోషల్‌ మీడియాలో కోహ్లి ఫాలోవర్ల సంఖ్య మొత్తంగా 310 మిలియన్‌కు చేరింది.


విరాట్‌ కోహ్లి(PC: Virat Kohli Instagram)

కాగా ట్విటర్‌లో 50 మిలియన్‌ ఫాలోవర్ల సంఖ్యను చేరుకున్న మొదటి క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో(450 మిలియన్‌), లియోనల్‌ మెస్సీ(333 మిలియన్‌) తర్వాత అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన మూడో క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ప్రస్తుతం.. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు.

చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్‌ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్‌.. కానీ ఏం లాభం?
క్రికెట్‌ సౌతాఫ్రికాకు భారీ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement