Asia Cup 2022 Super-4: India Vs Sri Lanka Match Live Updates-Highlights - Sakshi
Sakshi News home page

Super-4 IND Vs SL: లంక ఘన విజయం.. ఆసియాకప్‌ నుంచి టీమిండియా ఔట్‌

Published Tue, Sep 6 2022 7:03 PM | Last Updated on Tue, Sep 6 2022 11:16 PM

Asia Cup 2022 Super-4: India Vs Sri Lanka Match Live Updates-Highlights - Sakshi

లంక ఘన విజయం.. ఆసియాకప్‌ నుంచి టీమిండియా ఔట్‌
ఆసియాకప్‌ నుంచి టీమిండియా నిష్ర్కమించింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. లంక ఇన్నింగ్స్‌లో పాతుమ్‌ నిసాంక 52, కుషాల్‌ మెండిస్‌ 57 పరుగులు చేయగా.. చివర్లో దాసున్‌ షనక 33, బానుక రాజపక్స 25 పరుగులు నాటౌట్‌గా నిలిచి లంకకు విజయమందించారు. టీమిండియా బౌలర్లలో చహల్‌ 3, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.

చహల్‌ మ్యాజిక్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన లంక
► 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ తెలివైన బంతితో కుషాల్‌ మెండిస్‌ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రాజపక్స 7, షనక 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చహల్‌ దెబ్బ​.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్‌
► టీమిండియాతో మ్యాచ్‌లో శ్రీలంక వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో మొదట 52 పరుగులు చేసిన నిసాంక సూర్యకుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత చరిత్‌ అసలంక డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. కుషాల్‌ మెండిస్‌ 46 పరుగులతో ఆడుతున్నాడు.

ధాటిగా ఆడుతున్న శ్రీలంక.. 8 ఓవర్లలో 74/0
►174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ధాటిగా ఆడుతువంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. పాతుమ్‌ నిసాంక 39, కుషాల్‌ మెండిస్‌ 35 పరుగులతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 174.. 4 ఓవర్లలో లంక స్కోరెంతంటే?
►174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. పాతుమ్‌ నిసాంక 23, కుషాల్‌ మెండిస్‌ 4 పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా 173/8.. శ్రీలంక టార్గెట్‌ 174
►ఆసియా కప్‌లో భాగంగా సూపర్‌-4లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 72 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 34 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్‌, కోహ్లిలు తొందరగా పెవిలియన్‌ చేరినప్పటికి.. రోహిత్‌, సూర్యకుమార్‌లు టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు ఇద్దరి మధ్య 96 పరుగులు భాగస్వామ్యం నమోదైంది.

అయితే రోహిత్‌, సూర్యకుమార్‌లు ఔటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీనిక తోడూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పో‍యింది. ఒక దశలో 200 పరుగుల స్కోరు దాటుతుందనుకుంటే 173 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్‌ మధుషనక 3, దాసున్‌ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్‌ తీక్షణ ఒక వికెట్‌ తీశాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రిషబ్‌ పంత్‌(17) ఔట్‌
►శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా రిషబ్‌ పంత్‌(17) మధుషనక బౌలింగ్‌లో నిసాంకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు దీపక్‌ హుడా(3 పరుగులు).. దిల్షాన్‌ మధుషనక బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రోహిత్‌ శర్మ(72) ఔట్‌
శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. దాటిగా ఆడిన రోహిత్‌ శర్మ(72) కరుణరత్నే బౌలింగ్‌లో నిసాంకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.

12 ఓవర్లు పూర్తయ్యేసరికి 109/2
► శ్రీలంకతో టీ20లో టీమిండియా దూకుడుగానే ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ క్రీజులో ఉన్నారు.

11 ఓవర్లు ముగిసేరికి..
► పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 91 పరుగులు సాధించింది. హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లు నిలకడగా ఆడుతున్నారు.

పది ఓవర్లకు టీమిండియా స్కోర్‌ ఎంతంటే.. 
►ఆసియా కప్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగులు సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ చేయగా.. మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
► టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేశారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు సాధించారు.

9 ఓవర్లకు టీమిండియా 65/2 
► తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 65 పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోయింది. రోహిత్‌ శర్మ(41), సూర్యకుమార్‌(15) పరుగులతో క్రీజులో ఉన్నారు.

7 ఓవర్లు ముగిసేరికి.. 
► ఏడు ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 54 రన్స్‌ చేసింది. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో ఉన్నారు.



5 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే?
► 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 20, సూర్యకుమార్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి డకౌట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
► శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి.. దిల్షాన్‌ మధుషనక బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌(6) ఔట్‌
► శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు మాత్రమే చేసి మహీష్‌ తీక్షణ బౌలింగ్‌లోఘెల్బగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక
 ఆసియాకప్‌లో భాగంలో సూపర్‌-4లో మంగళవారం టీమిండియా, శ్రీలంకల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఫైనల్‌ బరిలో నిలవాలంటే టీమిండియా లంకపై తప్పనిసరిగా గెలవాల్సిందే. టాస్‌ గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ ఏంచుకుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

టీమిండియా బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బౌలింగ్‌ పెద్ద సమస్యగా మారిపోయింది. గత మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కూడా ధారళంగా పరుగులు ఇవ్వడంతో బౌలింగ్‌ కూర్పులో ఒక స్పష్టత లేకుండా పోయింది. అలాగే పంత్‌, కార్తిక్‌లలో ఎవరిని తుది జ​ట్టులోకి తీసుకోవాలనేది కూడా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక అఫ్గానిస్తాన్‌పై విజయంతో శ్రీలంక ఫుల్‌ జోష్‌లో ఉంది. మరి టీమిండియాతో మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని లంక ఉవ్విళ్లూరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement