1020 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసి బ్యాక్‌కు యాక్షన్ అన్న సంకేతాలు పంపిన టీమిండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా కప్-2022లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీతో (61 బంతుల్లో 122 నాటౌట్) చెలరేగిన అనంతరం దాదా అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. నైపుణ్యం పరంగా కోహ్లి నన్ను మించిన ఆటగాడని ఆకాశానికెత్తాడు. రిటైరయ్యే నాటికి కోహ్లి తనకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడతాడని జోస్యం చెప్పాడు. కోహ్లి కెరీర్‌లో అవరోధాలను అధిగమించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు.
టాలెంట్ పరంగా కోహ్లి గొప్ప ఆటగాడనటానికి అతని రికార్డులే నిదర్శనమని అన్నాడు. కెప్టెన్సీ వివాదంలో కోహ్లి పట్ల కఠినంగా వ్యవహరించిన గంగూలీ.. రన్‌మెషీన్ తిరిగి ఫామ్‌ను అందుకున్న తర్వాత ఇలా పాజిటివ్‌గా రియాక్ట్ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, కోహ్లి ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విషయం విధితమే. ఈ టోర్నీలో కోహ్లి.. సెంచరీతో పాటు రెండు క్లాసిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన కోహ్లి.. కెరీర్‌లో 71వ శతకాన్ని, టీ20ల్లో తొలి సెంచరీని సాధించాడు. కోహ్లి సూపర్ సెంచరీ చెలరేగడంతో నామమాత్రంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లి చివరిసారి 2019 నవంబర్‌లో సెంచరీ సాధించాడు.
చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!
Comments
Please login to add a commentAdd a comment