
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ 6 ప్రారంభం కానుంది. ఈ రోజు (సెప్టెంబర్ 4) సాయంత్రం 6 గంటలకు స్టార్‌మా ఈ షో ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు అంగరంగ వైభవంగా ఆరో సీజన్ ప్రారంభం కానుంది. అయితే తొలి రోజే బిగ్‌బాస్‌కి భారీ దెబ్బ పడనుంది. ఈ బిగ్ రియాల్టీ షోని గ్రాండ్‌గా లాంచ్ చేసి మంచి టీఆర్పీ రేటింగ్‌ని సాధించాలని భావించిన మేకర్స్ ఆశలకు గండి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
(చదవండి: ప్రోమో వచ్చేసింది.. ఈ కంటెస్టెంట్స్‌ని గుర్తు పట్టారా?)
ఈ షో ప్రారంభం సమయంలోనే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో నేడు భారత్-పాక్‌లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ఎఫెక్ట్ కచ్చితంగా ‘బిగ్‌బాస్’పై పడుతుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి.
బిగ్‌బాస్ షోని ఇష్టపడే యువతలో కూడా చాలామంది క్రికెట్ ప్రియులు ఉంటారని.. వాళ్ల మొదటి ప్రాధాన్యత ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కే ఉంటుందని కొంతమంది సీనీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ క్రికెట్ గండం నుంచి ‘బిగ్‌బాస్’ బయట పడి మంచి టీఆర్పీ రేటింగ్‌ని సాధిస్తాడో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment