Pakistan Vs Afghanistan, Asia Cup 2022 Super 4: Pakistan Beat Afghanistan By 1 Wicket - Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి

Published Wed, Sep 7 2022 11:04 PM | Last Updated on Thu, Sep 8 2022 8:44 AM

Pakistan Won By-1 Wicket Vs AFG Super-4 Enters Asia Cup 2022 Final - Sakshi

షార్జా: భారత్‌ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్‌ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్‌ ఆసియా కప్‌ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ‘సూపర్‌–4’లో బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాదాబ్‌ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) రాణించారు. జట్టు స్కోరు 97 పరుగుల స్కోరు వద్ద షాదాబ్‌ అవుట్‌ కాగా... స్వల్పవ్యవధిలో పాక్‌ 6 వికెట్లు కోల్పోయి పరాజయానికి దగ్గరైంది.

పాక్‌ నెగ్గేందుకు ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా... ఫారూఖి వేసిన తొలి రెండు బంతులపై సిక్సర్లు కొట్టిన నసీమ్‌ షా (4 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్స్‌లు) పాక్‌ జట్టును గెలిపించడంతోపాటు ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఓపెనర్‌ హజ్రతుల్లా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు), ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ (15 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. పాక్‌ బౌలర్లు రవూఫ్‌ 2, నసీమ్‌ షా, హస్‌నైన్, నవాజ్, షాదాబ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement