Pakistan Fans Match Fixing Allegations Against India vs Afghanistan - Sakshi
Sakshi News home page

Asia cup 2022 Afg vs Ind: 'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్‌ కోసమే'

Published Fri, Sep 9 2022 6:45 PM | Last Updated on Fri, Sep 9 2022 8:06 PM

Pakistan fans Match fixing allegations Against india vs afg - Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన అఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. దుబాయ్‌ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై 101 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు.

దీంతో తన 71 సెంచరీ కోసం కోహ్లి మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అదే విధంగా ఇది కోహ్లి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక​ తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గాన్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించిడంతో 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

కాగా అంతకుముందు సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్‌ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క వికెట్‌ తేడాతో ఆఫ్గాన్‌ పరాజయం పాలైంది. అయితే పాక్‌పై అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్‌ భారత్‌పై మాత్రం అన్ని విధాలుగా విఫలమైంది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ ఫీల్డింగ్‌లో కూడా చేతులెత్తేసింది. విరాట్‌ కోహ్లి, పంత్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిచారు. 28 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి ఏకంగా 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో పాక్‌ అభిమానులు మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఐపీఎల్‌ కోసమే ఆఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లు అమ్ముడు పోయారంటూ ట్విట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం ట్విటర్‌లో # ఫిక్సింగ్‌ అనే కీవర్డ్‌ ట్రెండింగ్ అవుతోంది. 


చదవండి: Asia Cup 2022: కింగ్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్‌ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement