T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా India defeated Afghanistan by 47 runs in their first Super Eight clash. Sakshi
Sakshi News home page

T20 World Cup 2024 Super 8: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

Jun 21 2024 12:58 AM | Updated on Jun 21 2024 2:04 PM

 T20 World Cup 2024: Team India Beat Afghanistan By 47 Runs

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బార్బడోస్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకు చాపచుట్టేసింది.

స్కై మెరుపులు..
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (24), రిషబ్‌ పంత్‌ (20),  హార్దిక్‌ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్‌ శర్మ (8), శివమ్‌ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్‌ ఉల్‌ హక్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

నిప్పులు చెరిగిన బుమ్రా..
182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement