
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ
Comments
Please login to add a commentAdd a comment