టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ది బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు వేసిన బుమ్రా ఏకంగా 20 డాట్ బాల్స్ సంధించి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా మెరుపు ప్రదర్శనతో విరుచుకుపడటంతో భారత్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో బుమ్రా చెలరేగడం ఇది తొలిసారి కాదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై 2/6, పాకిస్తాన్‌పై 3/14 మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసి రెండు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో మరింత డోస్ పెంచిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవలేదు కానీ.. జట్టు గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
బుమ్రాకు జతగా బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ సునాయాస విజయం సాధించింది. ఓవరాల్‌గా ఆఫ్ఘన్‌పై గెలుపులో అందరూ తలో చేయి వేసి టీమిండియాకు సూపర్ విక్టరీ అందించారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32).. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ (4-0-36-3), కుల్దీప్ (4-0-32-2), అక్షర్ పటేల్ (3-1-15-1), రవీంద్ర జడేజా (3-0-20-1) భారత్ గెలుపుకు దోహదపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment