ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్‌వుడ్ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సెమీ ఫైనల్లో రోహిత్ సేన తలొగ్గే పరిస్థితి కనబడటం లేదన్నాడు. ఇంగ్లండ్ గనుక గెలుపొందాలనుకుంటే అత్యంత అసాధారణంగా ఏదో ఒకటి జరగాలని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్ చేరిన ఇంగ్లిష్ టీమ్.. తుదిపోరులో పాకిస్తాన్‌పై గెలిచి చాంపియన్‌గా అవతరించింది.
అయితే, ఈసారి సూపర్-8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిన బట్లర్ బృందం.. అపజయం ఎరుగక ముందుకు సాగుతున్న పటిష్ట టీమిండియాను ఎలా ఎదుర్కోనుందన్నది ఆసక్తికరంగా మారింది.
అతడే కీలకం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ పాల్ కాలింగ్ వుడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఓడిపోతుందని అనుకోవడం లేదు.
ఇంగ్లండ్ అసాధారణ ఆట తీరు కనబరిస్తే తప్ప గెలవలేదు. భారత జట్టు ప్రస్తుతం మరింత పటిష్టంగా తయారైంది. ముఖ్యంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఫిట్‌గా.. పూర్తిస్థాయి నైపుణ్యాలు కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. అతడి బౌలింగ్ అస్త్రాలకు ఏ జట్టు బ్యాటర్ వద్ద సమాధానమే లేకుండా పోతోంది.
120 బంతుల గేమ్‌లో బుమ్రా వంటి సూపర్ పేసర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం కచ్చితంగా పెను ప్రభావమే చూపిస్తుంది.
అలా అయితే ఫలితం టీమిండియాకే అనుకూలం
ఇక టీమిండియా అమెరికాలోని కఠినమైన పిచ్‌లపై కూడా మ్యాచ్‌లు గెలవడం చూశాం. దూకుడైన ఆట తీరుతో రోహిత్ సేన ఆకట్టుకుంటోంది. గయానా పిచ్ ఎలా ఉంటుందన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంది.
ఏదేమైనా బంతి గనుక టర్న్ అయితే.. ఫలితం కచ్చితంగా టీమిండియాకే అనుకూలంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయి కానుందని కాలింగ్‌వుడ్ అంచనా వేశాడు. కాగా గురువారం(జూన్ 27) ఇరు జట్ల మధ్య రాత్రి సెమీ ఫైనల్ జరుగనుంది.
చదవండి: T20 WC: భారత్‌కు తాలిబన్ల ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు వీరే
Comments
Please login to add a commentAdd a comment