టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 మ్యాచ్‌లకు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అమెరికాలో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రోహిత్ సేన.. ఇప్పటికే వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది టీమిండియా. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తదితరులు ప్రాక్టీసులో తలమునకలయ్యారు.
విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.
పిచ్ ఎలా ఉండబోతోంది?
ఇదిలా ఉంటే.. టీమిండియా- అఫ్గనిస్తాన్‌కు మ్యాచ్‌కు వేదికైన బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్) పిచ్ ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్‌లోని నసావూ వికెట్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌టౌన్ పిచ్‌ను పరిశీలించిన రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి తమవైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని మరింత మెరుగుపరచుకునేందుకు స్కిల్ సెషన్స్‌ను ఉపయోగించుకుంటున్నాం.
మాకిది అలవాటే
తొలి మ్యాచ్ తర్వాత మూడు- నాలుగు రోజుల వ్యవధిలోనే మేము మళ్లీ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. విరామం లేని షెడ్యూల్ వల్ల కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే, మాకిది అలవాటే.
ప్రస్తుతం మా దృష్టి మొత్తం సమిష్టిగా ఎలా రాణించాలన్న అంశం మీదే ఉంది. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
పిచ్ ఎలా ఉంది బుమ్రా
ఈ సందర్భంగా తమ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి.. ‘‘పిచ్ ఎలా ఉంది’’ అని రోహిత్ శర్మ ప్రశ్నించగా.. అతడు బాగానే ఉందంటూ బదులిచ్చాడు.
కాగా సూపర్-8 మ్యాచ్‌ల వేదికలకు అనుగుణంగా టీమిండియా బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక అఫ్గన్ తర్వాత టీమిండియా శనివారం బంగ్లాదేశ్, సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్: భజ్జీ
Comments
Please login to add a commentAdd a comment