భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌.. తుది జట్టులో కుల్దీప్‌ | T20 World Cup 2024: India Won The Toss And Choose To Bat Against Afghanistan, Here's Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌.. తుది జట్టులో కుల్దీప్‌

Published Thu, Jun 20 2024 7:42 PM | Last Updated on Fri, Jun 21 2024 2:02 PM

 T20 World Cup 2024: India Won The Toss And Choose To Bat Against Afghanistan, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్‌ 20) భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం​ కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్‌కు సంబంధించి సిరాజ్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్‌ తరఫున కరీమ్‌ జనత్‌ స్థానంలో హజ్రతుల్లా జజాయ్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్‌), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్‌ హక్‌ ఫారూఖీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement