
ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లో లేని కోహ్లి టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు అర్థశతకాలతో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్న కోహ్లి ప్రస్తుతం టీమిండియా తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. అయితే పాక్‌తో మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నప్పుడు ధోని మినహా మిగతవారెవరు మెసేజ్ చేయలేదని.. ధోనితో తనకున్న ప్రత్యేక అనుబంధం వల్ల ఇది జరిగిందంటూ పేర్కొన్నాడు.
కాగా కోహ్లి వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీసీసీఐని టార్గెట్ చేస్తూ కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే అతని వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఆ విమర్శించిన వారిలో మాజీ క్రికెటర్లు ఉన్నారు. ఇంకా ఏం మెసేజ్ కావాలి అంటూ గావస్కర్ కోహ్లిపై విమర్వలు కురిపించాడు. అయితే ఈ సమస్య ముగిసిపోకముందే కోహ్లి మంగళవారం లంకతో మ్యాచ్‌కు ముందు.. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరో ఆసక్తికర పోస్టు చేశాడు.
''నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు.. నీ పక్కనున్న వాళ్లలో ఎవరు సంతోషించారో.. నువ్వు బాధలో ఉన్న సమయంలో నీ బాధను ఎవరైతే పంచుకున్నారో.. వాళ్లకు మాత్రమే నీ గుండెల్లో పదిలమైన స్థానం ఉంటుంది.'' అంటూ పేర్కొన్నాడు. ''కోహ్లి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశాడో అర్థం కాలేదు''అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment