గ్రౌండ్‌లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్‌ షాక్‌! | Pakistans Asif Ali, Afghanistan pacer Fareed Ahmad fined for breaching ICC Code of Conduct | Sakshi
Sakshi News home page

Asia Cup 2022: గ్రౌండ్‌లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్‌ షాక్‌!

Published Sat, Sep 10 2022 11:19 AM | Last Updated on Sat, Sep 10 2022 11:28 AM

Pakistans Asif Ali, Afghanistan pacer Fareed Ahmad fined for breaching ICC Code of Conduct - Sakshi

ఆసియాకప్‌-2022 సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్‌ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అఖరి ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆనూహ్యంగా ఒక్క వికెట్‌ తేడాతో ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆఫ్గాన్‌ బౌలర్‌ ఫరీద్‌ ఆహ్మద్‌, పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ ఆలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన అలీ.. తర్వాత బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో వికెట్‌ తీసిన ఆనందలో ఫరీద్‌.. అలీ దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ జరుపున్నాడు. అయితే తన సహానాన్ని కోల్పోయిన అలీ.. బౌలర్‌పై కొట్టడానికి బ్యాట్‌ ఎత్తాడు.

దీంతో ఆసీఫ్‌ ఆలీ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లతో పాటు, అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. ట్విటర్‌లో# 'బ్యాన్‌ ఆసీఫ్‌ ఆలీ' హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా ఆఫ్గాన్‌ అభిమానులు ట్రెండ్‌ చేశారు. ఈ క్రమంలో  వీరిద్దరికి ఐసీసీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఫరీద్ అహ్మద్,  అసిఫ్ ఆలీలకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు చెరో డీ మోరిట్ పాయింట్ వేసింది.
చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్‌ రిజ్వాన్‌ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్‌ ఆజాం ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement