ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు... వీడియో షేర్‌ చేసిన ఐసీసీ | Asif Alis Sixes Blitz In Penultimate Over Seals Win For Pakistan vs Afghanistan In T20 World Cup | Sakshi
Sakshi News home page

Asif Ali: ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు... వీడియో షేర్‌ చేసిన ఐసీసీ

Published Sat, Oct 30 2021 5:35 PM | Last Updated on Sat, Oct 30 2021 5:44 PM

Asif Alis Sixes Blitz In Penultimate Over Seals Win For Pakistan vs Afghanistan In T20 World Cup - Sakshi

Asif Alis Sixes: టీ20 ప్రపంచకప్‌2021 సూపర్‌-12లో భాగంగా శుక్రవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచులు దాకా వెళ్లిన పాకిస్తాన్‌ తృటిలో తప్పించకుకుంది. కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఆసిఫ్‌ అలీ  పాకిస్తాన్‌కు ఆద్బుత విజయాన్ని అందించాడు.  టాస్‌ గెలిచి  ముందు బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌ 147 పరగులు చేసింది. 148 పరగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆనంతరం ఫఖార్ జమాన్‌తో కలిసి బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దాడు.

30 పరుగులు చేసిన జమాన్‌ను నబీ పెవిలియన్‌కు పంపాడు. ఆనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ హాషీజ్‌ కేవలం​ 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. వెంటనే బాబర్‌(51)ను రషీద్‌ అవుట్‌ చేయడంతో  ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్‌ ఉల్‌ హఖ్‌ 2 పరుగులే ఇచ్చి మాలిక్‌ (19) వికెట్‌ తీయడంతో అఫ్గాన్‌ గెలుపుపై ఆశలు పెంచుకుంది. చివరి 12 బంతుల్లో 24 పరుగుల కావల్సిన నేపథ్యంలో.. కరీమ్‌ జనత్‌ వేసిన 19వ ఓవర్లో ఆసిఫ్‌ అలీ ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఆసిఫ్‌ అలీ బాదిన 4 సిక్సర్లకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: SA Vs SL: డికాక్‌ మొకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement