Rashid Khan Requests Pakistan and Afghanistan fans: టి20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఆప్గనిస్తాన్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రషీద్ ఖాన్ అభిమానులను ఉద్దేశించి కీలక వాఖ్యలు చేశాడు. రెండేళ్ళ క్రితం జరిగినట్లు ఏటువంటి గొడవలు సృష్టించవద్దని ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ప్రేక్షకులకు రషీద్ ఖాన్ అభ్యర్థన చేసాడు.
“ఖచ్చితంగా పాకిస్తాన్‌తో మాకు ఎల్లప్పుడూ పోటీ ఉంటుంది. కానీ ఇది కేవలం ఆటగానే చూడండి. అభిమానులందరూ ప్రశాంతంగా ఆటను ఆస్వాదించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. 2019 ప్రపంచ కప్‌లో ఏం జరిగిందో అలా జరగకూడదు' అని రషీద్ పేర్కొన్నట్లు క్రికెట్ పాకిస్థాన్ తెలిపింది..
2019లో ఏం జరిగిందంటే....
2019 వన్డే ప్రపంచ కప్‌లో లీడ్స్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్ మధ్య ఓ కీలక మ్యాచ్ జరిగింది. చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరుదేశాల అభిమానుల మధ్య స్టేడియంలో తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment