షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 18.4 ఓవర్లలో ఆలౌటైంది. పాక్ బౌలర్లలో ఇహ్సానుల్లా,షాదాబ్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు.
ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్భాజ్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మూడో టీ20లో ఓటమిపాలైనప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించిన ఆఫ్గాన్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఆఫ్గాన్‌కు పాక్‌పై ఇదే తొలి టీ20 సిరీస్ విజయం.
రషీద్ ఖాన్ అరుదైన రికార్డు
ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ టీ20ల్లో ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సృష్టించాడు. టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు వేసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డులకెక్కాడు. సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 106 డెలివరీకి పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్ సిక్స్ బాదడంతో రషీద్ రికార్డుకు బ్రేక్ పడింది.
ఈ మ్యాచ్‌లో రషీద్ బ్యాటింగ్‌లో కూడా 16 పరుగులు చేశాడు. ఇక యూఏఈ నుంచి నేరుగా రషీద్ ఖాన్ భారత్‌కు రానున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో అతడు కలవనున్నాడు.
చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!
Rashid Khan is truly a magician. pic.twitter.com/ruMAkdOnZZ
— Mazher Arshad (@MazherArshad) March 27, 2023
Comments
Please login to add a commentAdd a comment