T20 World Cup 2021 AFG Vs NZ: Rashid Khan Reaction To R Ashwin Offer Goes Viral - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 AFG VS NZ: అశ్విన్‌ ట్వీట్‌కు తెలుగులో బదులిచ్చిన రషీద్‌ ఖాన్‌

Published Fri, Nov 5 2021 7:51 PM | Last Updated on Sat, Nov 6 2021 11:47 AM

T20 World Cup 2021 AFG VS NZ: Rashid Khan Responds To Ashwin Offer For Afghanistan - Sakshi

Rashid Khan Responds To Ashwin Offer For Afghanistan Ahead Of Their Clash Against Kiwis: టీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌ విజయం సాధించాలని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆకాంక్షించాడు. ఇందుకోసం గాయపడిన అఫ్గాన్‌ ప్రధాన స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌కు టీమిండియా ఫిజియో సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సరదాగా వ్యాఖ్యానించాడు. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అఫ్గాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉండడంతో అశ్విన్‌ ఈ మేరకు సరదా వ్యాఖ్యలు చేశాడు. 

ఈ వ్యాఖ్యలను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ట్వీట్ చేయగా.. రషీద్ ఖాన్‌ స్పందించాడు. 'టెన్షన్‌ పడకు అశ్విన్ భాయ్.. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడా ముజీబ్‌ను చూసుకుంటున్నారు.' అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో "చూసుకుంటున్నారు" అన్న పదం తెలుగులో ఉండడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. రషీద్ తెలుగు పదాన్ని వాడి ట్వీట్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రషీద్.. జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర కొన్ని తెలుగు పదాలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Rohit Sharma: ఆ ముచ్చట తీరకుండా, ఎన్ని సెంచరీలు చేసి ఏం లాభం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement