సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. 20 సభ్యులున్న ఈ జట్టుకు హష్మతుల్లా షాహిది సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా రషీద్ ఖాన్‌కు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
రషీద్‌కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ లేదని ఏసీబీ పేర్కొంది. రషీద్ ఆగస్ట్ 12న జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అర్దంతరంగా అతను ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ ఇటీవల జరిగిన ఓ లోకల్ టోర్నీలో పాల్గొన్నా టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయి అతనికి లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. రషీద్.. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ అనంతరం జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కంతా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.
సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 18-22 మధ్య తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 20 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ఈనెల 28న గ్రేటర్ నొయిడాలోకి సన్నాహక శిబిరానికి చేరుకుంటుంది. ఈ సన్నాహక శిబిరంలో ప్రతిభ ఆధారంగా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తారు. బీసీసీఐ గ్రేటర్ నోయిడాను ఆఫ్ఘనిస్తాన్‌కు హోం గ్రౌండ్ కింద అలాట్ చేసిన విషయం తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, బహీర్ షా మహబూబ్, ఇక్రమ్ అలీఖేల్ (వికెట్‌కీపర్), షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నాయబ్, అఫ్సర్ జజాయ్ (వికెట్‌కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, షాహమ్‌సుర్ రెహ్మాన్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీద్ జద్రాన్, ఖలీల్ అహ్మద్, యమా అరబ్.
Comments
Please login to add a commentAdd a comment